అవును కరోనా వైరస్ విషయంలో అగ్రరాజ్యం అమెరికా అధ్యక్షుడు తాజాగా చేసిన ప్రకటన అలాగే ఉంది. ప్రపంచంలోని మిగిలిన దేశాల సంగతి ఎలాగున్నా వైరస్ దెబ్బకు అమెరికా మాత్రం అల్లాడిపోతోంది. కరోనా దెబ్బకు అమెరికా ఇంతలా తల్లకిందులైపోతుందని ప్రపంచంలో బహుశా ఎవరూ ఊహించుండరేమో ? ప్రపంచంలోని  అన్నీ దేశాల్లో కలిపి కరోనా వైరస్ బాధితులు సుమారు 9.65 లక్షలుంటే ఒక్క అమెరికాలో మాత్రమే సుమారు 2.2 లక్షలున్నారు.

 

బాధితుల్లోనే కాదు మరణాల్లో కూడా అమెరికా చాలా స్పీడుగా ఉంది. మందే లేని వైరస్ గురించి  అధ్యక్షుడు ట్రంప్ మాట్లాడుతూ అమెరికాను దేవుడే కాపాడాలని చెప్పాడు. వైరస్ కు విరుగుడుగా వ్యాక్సిన్ కోసం ప్రపంచ దేశాలు కృషి చేస్తున్నా అది తయారయ్యేందుకు ఇంకా సమయం పడుతుందని ట్రంప్ ప్రకటించాడు. అంత వరకూ అమెరికాకు ఇబ్బందులు తప్పవని కూడా అంగీకరించటమే ఆశ్చర్యంగా ఉంది. నిజానికి వైరస్ అమెరికాలో ఇంతగా పెరిగిపోవటానికి ట్రంప్ కూడా ఓ రకంగా కారణమే. జనాలను ముందుగా అప్రమత్తం చేయకపోవటం ప్రభుత్వం తప్పయితే జనాల్లోని నిర్లక్ష్యం మరో కారణం.

 

ఒక్కసారిగా వైరస్ అమెరికాను చుట్టుముట్టిన తర్వాతే తీవ్రతను అక్కడి ప్రభుత్వం గుర్తించింది. అయితే అప్పటికే బాగా ఆలస్యమైపోయింది. న్యూయార్క్, న్యూజెర్సీ, కాలిఫోర్నియా రాష్ట్రాల్లో చైనా వాళ్ళు ఎక్కువగా ఉంటారట. ఇపుడు కరోనా బాధితుల సంఖ్య కూడా పై రాష్ట్రాల్లోనే చాలా ఎక్కువగా ఉంది. అంటే చైనా వాళ్ళు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లోనే వైరస్ వ్యాప్తి కూడా ఎక్కువగా ఉందని అర్ధమవుతోంది.

 

చేతులు కాలిన తర్వాత ఆకులు పట్టకున్నట్లుగా కేసుల సంఖ్య వేలు దాటిపోతున్నపుడు కొన్ని రాష్ట్రాలు లాక్ డౌన్ ప్రకటించాయి. అయితే అప్పటికే ఆలస్యమైపోవటంతో ఇపుడు కేసులు లక్షలు కూడా దాటిపోయింది. రాబోయే రెండు వారాల్లో కేసులు, మరణాలు మరింత ఎక్కువైపోతాయని స్వయంగా ట్రంపే అంగీకరించాడంటే అమెరికాను నిజంగా దేవుడే రక్షించాలి.

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: