కరోనా వైరస్ ప్రపంచాన్ని గడగడలాడిస్తోంది. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ కారణంగా ప్రపంచం అంత వెనకడుగు వేస్తుంది. ప్రపంచవ్యాప్తంగా ఇప్పటికే 9లక్షల 50 వేలమంది ఈ కరోనా బారిన పడ్డారు.. అందులో 48 వేలమంది మృతి చెందారు. ఇలా మనుషులను వేలల్లో ఈ కరోనా వైరస్ చంపుతుంది. 

 

దీంతో ప్రపంచ దేశాలు అన్ని కూడా లాక్ డౌన్ విధించాయి. దీంతో ప్రపంచ దేశాలు అన్ని కూడా ఆర్థికమాంద్యంలో పడిపోయాయి. ఇంకా మన భారత్ లో అయితే గత నెల రోజులుగా పరిస్థితులు ఎంత దారుణంగా ఉన్నాయో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఇంకా ఈ నేపథ్యంలోనే భారతీయులు తన మాతృభూమిపై ప్రేమ చూపిస్తూ విరాళాలు ఇచ్చారు. 

 

అలా విరాళాలు ఇచ్చి చరిత్రలో ఎక్కిన వారు కొందరు ఉంటే మరికొందరు ట్విట్టర్ లో ట్విట్లు చేస్తూ కాలక్షేపం చేస్తున్నారు. విరాళాలు ఇచ్చి భారత్ ను ముందుకు నడిపించండి అని ఎందరో పిలుపునిచ్చినప్పట్టికి.. కోటీశ్వరులు అయినప్పటికీ.. ఎన్నో బిజినెస్ లు చేస్తూ ముందు ఉన్నప్పటికీ విరాళాలు ఇవ్వలేదు.. పక్క దేశాలలో పుట్టిన కంపెనీలు ఈ దేశంలోకి వచ్చి భారతీయుల సొమ్ము తిన్నారు తప్ప భారతీయులకు విరాళాలు ఇవ్వాలి అంటే మాత్రం వెనకడుగు వేస్తున్నారు.

 

మన భారత్ కు విరాళాలు ఇచ్చి ఆదుకున్నది మన భారత్ కంపెనీలే.. స్వదేశం నుండి వచ్చి ఇక్కడ బిజినెస్ చేస్తున్న కంపెనీలు కాదు.. మనం ఏమో మన భారతీయ వాటిపై కంటే కూడా స్వదేశానికి సంబంధించిన వాటినే కొనుగోలు చెయ్యడానికి ఇష్టపడుతాం.. కానీ స్వదేశం మన సంపదను దోచుకోవడం తప్ప మనకు కష్టం వస్తే సహాయం చేసేవారు కాదు అని ఇప్పుడైనా అర్థం చేసుకోండి. 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: