కరోనా వ్యాప్తిని నియంత్రించేందుకు దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ కొనసాగిస్తున్నప్పటికి కొన్ని రాష్ట్రాల్లో కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్నారు.   ఎన్ని కట్టు దిట్టాలు చేస్తున్నా.. ఈ కరోనా మహమ్మారి రోజు రోజుకీ తన ప్రతాపాన్ని చూపిస్తూనే ఉంది.  భారత్‌లో సామాన్య ప్రజలు ఇబ్బందులు పడకుండా ప్రధాని మోదీ ఎన్నో చర్యలు తీసుకుంటున్నారని ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రశంసలు కురిపించింది. ప్రజల సంక్షేమం కోసం ఎలాంటి చర్యలు తీసుకోవాలన్న విషయంపై భారత్‌ను ఉదాహరణగా చూపెట్టింది. 

 

కరోనా వైరస్ వల్ల లాక్ డౌన్ పాటిస్తున్న నేపథ్యంలో మద్య తరగతి వాళ్లు ఇబ్బందులు పడుతున్నారు. రోజు కూలీ చేసుకునేవారు.. ట్రావెలింగ్ సిబ్బంది.. ఆటో డ్రైవర్లు ఇబ్బందులు పడుతున్నారు.   సిద్దిపేటలో ఆటో డ్రౌైవర్ల కోసం మంత్రి హరీష్ రావు  రూ.1250 ఇచ్చిన విషయం తెలిసిందే.  తాజాగా ఢిల్లీ సీఎం కేజ్రీవాల్ మరోసారి తన మంచితనం చాటుకున్నారు.   

 

దేశ‌రాజ‌ధాని ఢిల్లీలో ఉన్న ఆటో, ట్యాక్సీ డ్రైవ‌ర్ల అకౌంట్ల‌లోకి 5వేలు ట్రాన్స్‌ఫ‌ర్ చేయ‌నున్న‌ట్లు సీఎం కేజ్రీవాల్ తెలిపారు.  ఢిల్లీలో ఇప్ప‌టి వ‌ర‌కు 219 కోవిడ్‌19 పాజిటివ్ కేసులు న‌మోదు అయ్యాయి. న‌లుగురు మృతిచెందారు.  నేరుగా వారి ఖాతాల్లోనే జమ చేయనున్నట్లు వివరించారు. అయితే, ఇది అమలు చేసేందుకు దాదాపు వారం నుంచి పది రోజుల లోపు సమయం పడుతుందని కేజ్రీవాల్ పేర్కొన్నారు.  దేశ వ్యాప్తంగా ఎంత కట్టడి చేస్తున్నా రోజు రోజుకీ కరోనా వైరస్ తీవ్రత పెరిగిపోతూనే ఉంది.   

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: