క్షేత్రస్ధాయిలో జరుగుతున్న వ్యవహారాలు చూస్తుంటే ఇదే అనుమానం పెరిగిపోతోంది. తెలంగాణాలో కేసియార్ మొదటిసారి సిఎం అయినపుడే పచ్చమీడియాకు ముచ్చెమటలు పట్టించాడు. తన ప్రభుత్వంపై నోటికొచ్చినట్లు మాట్లాడి, బుర్రకు తోచింది రాసినందుకు పచ్చమీడియాను బ్యాన్ చేసిన విషయం అందరికీ తెలిసిందే. కేసియార్ పై గొప్పగా యుద్ధం చేస్తున్నామని ప్రకటించుకున్న యాజమాన్యాలు వేరే దారిలేక చివరకు కాళ్ళబేరానికి వచ్చాయి. అప్పటికే సుమారు మూడు నెలలుగా చానళ్ళు, పేపర్ మార్కెట్లో కనబడకపోవటంతో యాజమాన్యాలకు వేరే దారిలేకపోయింది.

 

అప్పటి నుండి ఇప్పటి వరకు కేసియార్ పైన కానీ కుటుంబంపైన కానీ చివరకు ప్రభుత్వంపైన కూడా వ్యతిరేకంగా ఒక్క వార్త, కథనం కనిపిస్తే ఒట్టు. అంటే మీడియాను కేసియార్ ఏ స్ధాయిలో చెప్పుకింద తొక్కిపెట్టాడో అందరికీ అర్ధమైపోయింది. మీడియా సంస్ధల యాజమాన్యాలు కూడా ఎందుకు కిక్కిరుమనకుండా పడుంటున్నాయంటే వాటి బిజినెస్ లు, ఆస్తులను కాపాడు కునేందుకే అని ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. కరోనా వైరస్ నేపధ్యంలో ఉద్యోగుల జీతాల్లో కోత విధించిన వ్యతిరేకంగా ఒక్క ముక్క కూడా కనబడలేదు.

 

సీన్ కట్ చేస్తే ఏపిలో మాత్రం ఇదే పచ్చమీడియా విపరీతంగా రెచ్చిపోతోంది. జగన్మోహన్ రెడ్డి తీసుకుంటున్న ప్రతి నిర్ణయాన్ని భూతద్దంలో చూసి తప్పులు పడుతోంది. ఇక్కడ కూడా కరోనా వైరస్ నేపధ్యంలో రెండు వాయిదాల్లో ఉద్యోగులకు జీతాలు చెల్లించాలని నిర్ణయించాడు. అయితే జగన్ నిర్ణయాన్ని పచ్చమీడియా తప్పు పట్టింది. ప్రభుత్వం దగ్గర డబ్బులుంచుకుని కూడా ఉద్యోగులకు రెండు విడతల్లో జీతాలు ఇవ్వటమేంటని రెచ్చిపోయింది. మరి ఇదే విషయాన్ని కేసియార్ ను ఎందుకు అడగలేదు ?

 

అంటే ఇక్కడ మ్యాటర్ క్లియర్ గా కనిపిస్తోంది. అదేమిటంటే పచ్చమీడియాకు కేసియార్ అంటే వెన్నులో వణుకు. అదే సమయంలో చంద్రబాబునాయుడు అంటే విపరీతమైన ప్రేమ. కేసియార్ ను ఏమీ చేయలేక చంద్రబాబును దెబ్బకొట్టాడన్న కోపాన్ని పచ్చమీడియా జగన్ పై చూపిస్తోంది. ఎందుకంటే పచ్చమీడియాను జగన్ ఏమీ చేయటం లేదు కాబట్టే.

మరింత సమాచారం తెలుసుకోండి: