దేశంలో కరోనా ప్రభావం రోజు రోజుకు పెరుగుతూనే ఉంది. దేశంలో ఒక్క రోజులోనే 12మంది ఈ వైరస్ బారిన పడి ప్రాణాలను కోల్పోయారు. దేశంలో లాక్ డౌన్ ప్రకటించినప్పటికీ కరోనా కేసులు ఏ మాత్రం తగ్గటం లేదు. దేశంలో కరోనా బాధితుల సంఖ్య రోజు రోజుకు గణనీయంగా పెరిగిపోతుంది. 

 

దేశంలో 328 కరోనా కేసులు పెరిగాయన్నారు. ఒక రోజులో ఇంత మంది కరోనా కారణంగా ప్రాణాలు కోల్పోవడం భారత్‌లో ఇదే తొలిసారి. భారత్‌లో కోవిడ్ కేసుల సంఖ్య 900కు చేరడానికి నాలుగు వారాలు సమయం పట్టగా.. కేవలం నాలుగు రోజుల వ్యవధిలోనే ఆ సంఖ్య రెట్టింపు కావడం ఆందోళన కలిగిస్తోంది.

 

దేశంలో ఇప్పటి వరకూ 1965 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయని కేంద్ర ఆరోగ్య శాఖ జాయింట్ సెక్రెటరీ లవ్ అగర్వాల్ ప్రకటించారు. నిజాముద్దీన్ జమాతే వల్లే 400 పాజిటివ్ కేసులు వచ్చాయని ఆయన స్పష్టం చేశారు.

 

కరోనా నేపథ్యంలో ప్రతిరోజూ ప్రెస్ మీట్‌లో భాగంగా ఆయన గురువారం హెల్త్ బులిటెన్ విడుదల చేశారు. మర్కజ్ ప్రార్థనకు వెళ్లిన తొమ్మిది వేల మందిని తాము గుర్తించామని ఈ సందర్బంగా తెలిపారు. వారందర్నీ క్వారంటైన్‌కు తరలించినట్లు ఆయన ప్రకటించారు.

1300 మంది విదేశీయులు మర్కజ్ ప్రార్థనల్లో పాల్గొన్నారని అధికారులు గుర్తించారని తెలిపారు. అయితే కరోనా సోకిన 400 మందితో 1950 మందికి లింక్ ఉందని ఆయన చెప్పారు. గడచిన 24 గంటల్లో 324 పాజిటివ్ కేసులు నమోదైనట్లు ఆయన తెలిపారు.

 

గడచిన 24 గంటల్లో కరోనా మహమ్మారితో 12 మంది చనిపోయినట్లు ఆయన ధృవీకరించారు. ప్రజలందరూ ప్రభుత్వం సూచించిన నియమాలను పాటించాలని, లాక్‌డౌన్ నిబంధనలను కూడా కచ్చితంగా పాటించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. క్వారంటైన్ లో ఉన్నవారందరూ అలాగే ఉండాలని, క్వారంటైన్ అనేది ఓ తపస్సు లాంటిదని లవ్ అగర్వాల్ అభిప్రాయపడ్డారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: