క‌రోనా వైర‌స్‌(కోవిడ్‌-19).. ఇప్పుడు ఎక్క‌డ చూసినా ఈ మ‌హ‌మ్మారి భ‌య‌మే నెల‌కొంది. ఎక్క‌డ ఈ వైర‌స్ త‌మ‌కు వ‌చ్చేస్తుందో అని ప్ర‌జ‌లు భ‌యంగా భ‌యంగా ఉంటున్నారు. చైనాలో పుట్టుకొచ్చిన ఈ వైర‌స్.. ప్ర‌పంచ‌దేశాలు వ్యాపించి.. అనేక మంది ప్ర‌జ‌ల‌ను బ‌లి తీసుకుంటుంది. ఇక దీని భాదితులు అయితే ల‌క్ష‌ల్లో ఉన్నారు. అయితే ఇప్పుడు క‌రోనా రాక‌ముందే.. వ‌చ్చింద‌న్న భ‌యంతో ఆత్మ‌హ‌త్య చేసుకుంటున్నారు కొంద‌రు. వైరస్ సంక్రమణపై సరైన అవగాహన లేని కారణంగా గత కొద్దిరోజులుగా దేశవ్యాప్తంగా పలుచోట్ల ఆత్మహత్య ఘటనలు చోటు చేసుకున్నాయి.

 

కరోనా వస్తుందేమోనన్న భయంతో కొందరు.. సోకిందేమోనన్న భయంతో ఇంకొందరు ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఈ క్ర‌మంలోనే క‌రోనా  భయంతో ఉత్తరప్రదేశ్‌లో తాజాగా ముగ్గురు ఆత్మహత్య చేసుకున్నారు. క్వారంటైన్‌ నుంచి తప్పించుకున్న 23 ఏళ్ల యువకుడు ఆత్మహత్యకు పాల్పడిన ఘటన లఖిమ్‌పూర్‌లో జరిగింది. మార్చి 28న గురుగ్రామ్‌లోని ఓ క్వారెంటైన్ కేంద్రానికి అతన్ని తరలించినట్టు చెప్పారు. అంతకుముందు రెండుసార్లు అతను క్వారెంటైన్ కేంద్రం నుంచి తప్పించుకుని తనవాళ్లను కలవడానికి ప్రయత్నించాడని.. కానీ అధికారులు అతన్ని పట్టుకుని తిరిగి క్వారెంటైన్‌కు తీసుకొచ్చారు.

 

అయితే మరోసారి తప్పించుకుని తన గ్రామానికి వెళ్లాడు. అయితే తన కోసం పోలీసులు వెతుకుతున్నారని తెలుసుకుని ఉరి వేసుకుని ఆత్మహత్య చేసుకున్నాడు. అలాగే జ్వరం, జలుబుతో బాధ పడుతున్న రైతు ఒకరు మంగళవారం మధురకు సమీపంలో బలవన్మరణానికి పాల్పడ్డాడు. తన గ్రామం కరోనా బారిన పడకుండా ఉండాలన్న ఉద్దేశంతో అతడు ఆత్మహత్య చేసుకున్నాడు. మ‌రియు సహరన్‌పూర్‌లోని ప్రభుత్వ ఉద్యోగి ఒకరు కార్యాలయంలోనే ఉరి వేసుకుని ఆత్మహత్యకు పాల్పడ్డాడు. 

 

కరోనావైరస్‌ సోకుతుందన్న భయంతో ప్రాణాలు తీసుకుంటున్నట్లు అతడు సూసైడ్‌ నోట్‌లో రాశాడు. ఇక కోవిడ్‌ సోకిన వ్యక్తి ఒకరు షామిలి జిల్లాలో బలవన్మరణానికి పాల్పడ్డారు. ఇలా ప‌లు చోట్ల క‌రోనా వ‌చ్చింద‌న్న భ‌యంతోనే ఆత్మహత్యలు చేసుకోవ‌డంతో దేశ‌వ్యాప్తంగా తీవ్ర క‌ల‌క‌లం రేగుతోంది.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple  
  

మరింత సమాచారం తెలుసుకోండి: