ఈ 21 రోజులు మ‌నం ఎలాంటి ఐటెమ్స్ తింటే ఎలాంటి విట‌మిన్స్ వ‌స్తాయంటే...ప్ర‌తిరోజూ త‌ప్ప‌ని స‌రిగా రెండు కోడిగుడ్లు లోప‌లి ప‌చ్చ‌సొన తీసేసి తినండి. వెజిటేరియ‌న్స్ అయితే క‌ప్పు ప‌ప్పు, క‌ప్పు ఆకుకూర సోయాబీన్స్ త‌ప్ప‌నిస‌రిగా తీసుకుంటే ఎంతో మంచిది. చికెన్ చాలా మంచిది అది కూడా తిన‌డం వ‌ల్ల‌న మ‌న శ‌రీరానికి ప్రొటీన్ అందుతుంది. ఇది బాగా హై ప్రొటీన్ డైట్‌. రాగులు తీసుకోవ‌డం కూడా చాలా మంచిది. పాలు,పెరుగు తీసుకోవ‌డం వ‌ల్ల పాల‌ల్లో క్యాల్‌షియం, ప్రొటీన్ ఉంటుంది. బెల్లం ఐర‌న్‌. డ్రై ఫ్రూట్స్ కూడా చాలా మంచిది. విట‌మిన్ సి ట్యాబ్లెట్స్ దొరుకుతాయి అవి రెండు తీసుకోండి.

 

మ‌ల్టివిట‌మిన్ ట్యాబ్లెట్‌, ఐరన్‌, క్యాల్షియ‌మ్‌, జింక్ ట్యాబ్లెట్స్ ఇవ‌న్నీ తీసుకుంటే చాలా మంచిది. ఇవ‌న్నీ తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కి ఆటోమెటిక్‌గా శ‌రీరంలో ఇమ్యూనిటీ ప‌వ‌ర్ అనేది పెరుగుతుంది. అలాగే ప‌సుపునీరు, వేడినీళ్ళు, హ‌నీవాట‌ర్ ఇవ‌న్నీకూడా త‌ప్ప‌కుండా తాగాలి. ఎంతో ఎల‌ర్ట్‌గా ఉండి శ్ర‌ద్ధ‌గా ఉంటే మ‌న శ‌రీరానికే కాదు మ‌న ఇంట్లో ఉన్న వారంద‌రికీ కూడా చాలా మంచిది. ప్ర‌స్తుతం బ‌య‌ట అంతా వైర‌స్ న‌డుస్తుంది కాబ‌ట్టి ప్రెగ్నెంట్ అవ్వ‌క‌పోవ‌డం చాలా మంచిది. ప్రెగ్నెంట్ కోసం ద‌య‌చేసి ప్లాన్ చేసుకోవ‌ద్దు. ఈ మూడు నెల‌లు ఫోలిక్ యాసిడ్ మందును వేసుకుని ఈ క్రైసెస్ పిరియ‌డ్ త‌గ్గిన త‌ర్వాత ప్రెగ్నెన్సీ గురించి ఆలోచిస్తే చాలా మంచిది. మోస్ట్‌లీ జాగ్ర‌త్త‌గా ఉండ‌డం  ఒక‌రి నుంచి మ‌రొక‌రు ఈ మూడు నెల‌లు అన్న‌ది చాలా ముఖ్యం.

 

అవేమిటంటే ఒక‌టి సెక్స్ చేసే స‌మ‌యంలో మ‌గ‌వారు కండోమ్ వాడితే చాలా మంచిది లేదా వీర్యాన్ని లోపల చేయ‌కుండా చూసుకోవాలి. కేవ‌లం ఎమ‌ర్జ‌న్సీ అంటేనే బ‌య‌ట‌కు రండి. మంచి ఆహారం తీసుకోవ‌డం వ‌ల్ల మ‌న‌కు ఇమ్యూనిటీ ప‌వ‌ర్ ఉంటే ఈ వ్యాధి బారి నుంచి స‌గం మ‌న‌ల్ని మ‌నం కాపాడుకున్న వాళ్ళం అవుతాము. ఎట్టి ప‌రిస్థితుల్లో జాగ్ర‌త్త అనేది వ‌హించాలని వైధ్యులు తెలుపుతున్నారు. భార్యా భ‌ర్త‌లిద్ద‌రూ కూడా సెక్స్ అవ్వ‌గానే శ‌రీరాన్ని శుభ్ర‌ప‌రుచుకోవాలి. అలాగే భ‌ర్తగాని భార్య‌గాని బ‌య‌ట‌కు వెళ్ళి వ‌స్తే ఖ‌చ్చితంగా స్నానం చేసిన త‌ర్వాతే సెక్స్ చేసుకోవాలి. లేదంటే అది చాలా ప్ర‌మాద‌మంటున్నారు వైధ్యులు. 

మరింత సమాచారం తెలుసుకోండి: