కరోనా మాయదారి మహమ్మారికి ప్రపంచ దేశాలు అల్లాడిపోతున్నాయి.  కొంచెం తగ్గు ముఖం  పడుతుందనుకొనే వివిధ రాష్ట్రాలలో, ముఖ్యంగా మన దేశ రాష్ట్రాలలో కరోనా కేసులు అనూహ్యంగా పెరిగి.. అందరి అంచనాలను తలక్రిందులు చేస్తున్నాయి... ఇక దానితో లాక్ డౌన్ విషయంఎంతో ఎటు తేల్చుకోలేక... కేంద్ర ప్రభుత్వం తల పట్టుకుంటోంది... 

 

కొద్ది సేపటి క్రితమే... మహారాష్ట్రలో పెరిగిన కరోనా పాజిటివ్ కేసులు.... అందరిని విస్మయానికి గురి చేస్తున్నాయి. ఇందుమూలంగా అక్కడి స్థానికులు మిక్కిలి భయాందోళనలకు గురి అవుతున్నారు. గడిచిన 12 గంటల వ్యవధిలోనే మహారాష్ట్రలో కొత్తగా 81 కేసులు నమోదు కావడం రికార్డు అనే చెప్పుకోవాలి. ఎందుకంటే.. మనదేశంలో మరే రాష్ట్రంలోనూ... ఒక్కసారిగా కేసులు ఇంతలా పెరిగిన దాఖలాలు లేవు.

 

ఇక పోతే... మహారాష్ట్రలో దీనితో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 416కు చేరడం కొసమెరుపు. అటు  తమిళనాడులో కూడా ఇదే స్థాయిలో కొత్త కేసులు... సుమారుగా 75 నమోదు అవ్వడం గమనార్హం. ఇక కొత్తగా నమోదు అయిన ఈ కేసులలో 99 శాతం మొన్న ఢిల్లీలో ముస్లిం మత కార్యక్రమం అయిన తబ్లీగి జమాత్ కు వెళ్లిన వారే కావడం విశేషం.. దీంతో.. తమిళనాడులో మొత్తం కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 309కి చేరింది. 

 

అటు కేరళలో కూడా.. 21 కొత్త కేసులు నమోదు అయ్యి.. కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 286కు చేరుకుంది. అలాగే జైపూర్ (రాజస్థాన్) లో 13 కేసులు, గంట క్రితమే నమోదు అయ్యాయి... అసలు విషయానికొస్తే... ఇక్కడ కొత్తగా నమోదు అయిన కేసులన్నీ మత ప్రార్థనలకు హాజరయిన వారి వలననే రెట్టింంపు అవుతున్నాయి... అనడంలో నిజం లేదని, సదరు ముస్లిం పెద్ద స్టేట్ మెంట్ ఇవ్వడం కొసమెరుపు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple: https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: