క‌రోనా తార స్థాయి ఇదేన‌ని ప్ర‌భుత్వం భావిస్తోందా..? ఇక క‌రోనాను క‌ట్ట‌డి చేయ‌గ‌లుగుతామ‌ని న‌మ్మ‌కం కుదిరిందా..? ఇండియ‌కు మ‌రీ అంత ప్ర‌మాదం లేద‌ని నిర్ణ‌యానికి వ‌చ్చేసిందా..? ఆర్థిక వ్య‌వ‌స్థ కుదేలు కాక‌ముందే తేరుకునేందుకు ప్ర‌ధాన మంత్రి మోదీ ధైర్యంగా ఓ ముంద‌డుగు వేస్తున్నారా..? అంటే ఈ ప్ర‌శ్న‌ల‌న్నిటికి అవున‌నే  స‌మాధానం వ‌స్తోంది. లాక్‌డౌన్ ముగియ‌డానికి ఇంకా దాదాపు 12 రోజుల గ‌డువున్న‌ప్ప‌టికీ ఇప్ప‌టి నుంచి ప్ర‌జ‌ల్లో మ‌నోధైర్యం క‌ల్పించేందుకు ఒక్కో రంగానికి గో హెడ్ అంటూ  నిబంధ‌న‌ల నుంచి అనుమ‌తులు ల‌భిస్తున్న‌ట్లు తెలుస్తోంది. 

 

కొన్ని ఆంక్ష‌ల‌తో రైలు స‌ర్వీసుల‌ను పున‌ర‌ద్ద‌రించాల‌ని నిర్ణ‌యించిన ప్ర‌భుత్వం తాజాగా విమాన స‌ర్వీసుల‌కు కూడా నిబంధ‌న‌ల నుంచి మిన‌హాయింపు ఇవ్వనున్న‌ట్లు స్ప‌ష్టం అవుతోంది. ఈ మేర‌కు 18 విమానాలను నడపనున్నట్టు ఎయిర్‌ ఇండియా సీఎండీ రాజీవ్‌ బన్సల్‌ గురువారం ఒక ప్ర‌క‌ట‌న‌లో వెల్ల‌డించ‌డం గ‌మ‌నార్హం. మ‌న దేశంలో చిక్కుపోయిన జర్మనీ, కెనడా, ఫ్రాన్స్‌, ఐర్లాండ్‌  పౌరులను తరలించేందుకు వీటిని నడపనున్నట్టు తెలిపారు. ఆయా దేశాల రాయబార కార్యాలయాల అభ్యర్థన మేరకు 18 చార్టడ్‌ విమానాలను నడుపుతామన్నారు. తిరుగు ప్ర‌యాణంలో  ఆయా దేశాల నుంచి విమానాలు  ఖాళీగానే వస్తాయని స్పష్టం చేశారు. 

 

మ‌రోవైపు  హాంగ్‌కాంగ్‌ నుంచి వైద్య పరికరాలు తీసుకొచ్చేందుకు 4, 5 తేదీల్లో కార్గో విమానాన్ని నడపనున్నట్టు రాజీవ్‌ బన్సల్‌ తెలిపారు. దీనికి అవసరమైన అనుమతులు కూడా లభించాయని ఆయ‌న తెలిపారు. ఇక షాంఘై నుంచి 6న మెడిక​​ల్స్‌ తీసుకొచ్చే విమానానికి అనుమతి రావాల్సి ఉందని తెలిపారు. ఇక  ఈ విమానాల్లో ప్రయాణించే క్యాబిన్‌ క్రూ సిబ్బందికి, గ్రౌండ్‌ స్టాఫ్‌కు శానిటైజర్లు, గ్లోవ్స్‌, మాస్కులతో పాటు వ్యక్తిగత రక్షణ పరికరాలు సమకూర్చ‌నున్న‌ట్లు తెలిపారు. విమానాలు తిరిగి వచ్చిన తర్వాత క్వారంటైన్‌లో ఉండాలని క్యాబిన్‌ క్రూ సిబ్బందికి సూచించినట్టు చెప్పారు.  దేశవ్యాప్తంగా లాక్‌డౌన్‌ అమలవుతుండగా దాదాపు రెండు వారాల తర్వాత దేశీయ విమానాలు తొలిసారిగా గగనయానం చేయ‌నుండ‌టం విశేషం.

 


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: