దేశంలో కరోనా ఎఫెక్ట్ ఎంతగా ఉందో ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు.  ప్రపంచాన్ని గడ గడలాడిస్తుంది.  కరోనా ఎఫెక్ట్ వల్ల సినిమా ఇండస్ట్రీ ఎంతగా నష్టపోతుందో తెలిసిందే.  ఈ కరోనా వల్ల అన్ని షూటింగ్స్ వాయిదా పడ్డాయి.. కొన్ని సినిమాల రిలీజ్ పోస్ట్ పోన్ చేసుకున్నారు.  సామాన్యుల నుంచి సెలబ్రెటీట వరకు ముఖ్యమైన కార్యక్రమాలు అన్నీ వాయిదా వేసుకుంటున్నారు.  ఈ నేపథ్యంలో టాలీవుడ్ హీరో నితిన్ తన పెళ్లి వాయిదా వేసుకున్న విషయం తెలిసిందే.  కరోనా వైరస్ మహమ్మారి కారణంగా ప్రస్తుతం అన్ని పనులు ఎక్కడికక్కడ నిలిచిపోయాయి.  సినిమా ఇండస్ట్రీకి చెందిన అన్ని పనులు కూడా వాయిదా పడ్డాయి.   

 

కరోనా వైరస్ ప్రభావంతో  నితిన్ తన పెళ్లిని వాయిదా వేసుకున్న సంగతి తెలిసిందే. ఏప్రిల్ 16న జరగాల్సిన పెళ్లి కరోనా వైరస్ ప్రభావంతో వాయిదా వేస్తున్నట్లు నితిన్ చెప్పుకొచ్చాడు.  కొన్ని రోజుల పాటు ఈయన తన పెళ్లిని వాయిదా వేసుకోక తప్పలేదు.   హ్యాపీడేస్ సినిమాతో పరిచయమైన ఈయన ఆ తర్వాత చాలా సినిమాలు చేసాడు. స్వామి రారా నుంచి ఈయన కెరీర్ మరో టర్న్ తీసుకుంది.రస విజయాలతో దూసుకుపోతున్న ఈ హీరో ఇప్పుడు మరో కొత్త అడుగు వేస్తున్నాడు.  అర్జున్ సురవరం సినిమాతో హిట్ కొట్టిన నిఖిల్.. ఇప్పుడు జీవితంలో కొత్త ఇన్నింగ్స్‌కు తెర తీస్తున్నాడు.

 

ఆమద్య నిఖిల్  తన ప్రేయసికి ప్రపోజ్ చేస్తున్న ఫోటోలు కూడా సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇద్దరూ కలిసి ఆ మధ్య ఫ్యామిలీ వెకేషన్ కూడా వెళ్లారు. అక్కడ్నుంచే ఫోటో సెషన్ కూడా చేసారు నిఖిల్ పల్లవి జోడీ. త్వరలోనే వీళ్ల పెళ్లి జరగనుంది.  ప్రస్తుతానికి డేట్ అయితే అనౌన్స్ చేయలేదు. త్వరలోనే నిఖిల్ పెళ్లిపై పూర్తి క్లారిటీ రానుంది.  మొత్తానికి కరోనా వైరస్ వల్ల సామాన్యులకే కాదు.. సెలబ్రెటీలకు తిప్పలు తప్పడం లేదు. 

మరింత సమాచారం తెలుసుకోండి: