భారతదేశంలో మార్చి 10వ తేదీన 50 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా మార్చి 20వ తేదీన ఆ సంఖ్య 216 కి చేరుకుంది. తర్వాత కేవలం పది రోజుల్లోనే అనగా మార్చి 31వ తేదీన కరోనా పీడితుల సంఖ్య 1397 కి చేరుకుంది. అయితే ఢిల్లీలో నిర్వహించిన మతపరమైన సదస్సులో చాలా మంది పాల్గొనడం వలన గత రెండు రోజుల్లోనే 1397 సంఖ్య కాస్త రెండు వేలకు చేరుకుంది. స్థానిక సంక్రమణ భారత దేశంలో ఇప్పటి వరకు లేదు కాబట్టి కరోనా పీడితుల సంఖ్య పెరగడం లేదు.


లోకల్ ట్రాన్స్మిషన్ ఉంటే పరిస్థితి వేరేలా ఉండేదని విశ్లేషకులు చెబుతున్నారు. తాజాగా ముంబాయికి చెందిన ఒక 54 ఏళ్ల వ్యక్తి మరణించగా... అతనికి ఏ ట్రావలింగ్ హిస్టరీ లేదు. అయితే అతను కరోనా లక్షణాలతో చనిపోయాడనే అనుమానాలు రేకెత్తుతున్నాయి. ఒకవేళ అదే జరిగితే స్థానిక సంక్రమణ కూడా భారతదేశంలో మొదలైందని తెలుస్తుంది.


ఇకపోతే చండీగఢ్ రాష్ట్రంలో కొత్తగా రెండు కేసులు నమోదు కాగా... వారిలో ఒకరు 55ఏళ్ల మహిళ కాగా... మరొకరు పది నెలల పాప. వీరిద్దరూ అమ్మమ్మ మనవరాలు కాగా... ఓ ఎన్ఆర్ఐ దంపతుల కారణంగా వారికి వైరస్ వచ్చినట్టు ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఈరోజు ఇండోర్ లో కోవిడ్ 19 టెస్ట్ చేసేందుకు వచ్చిన డాక్టర్ల పై ఘోరమైన దాడి జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో కూడా గాంధీ ఆసుపత్రి సిబ్బందిపై ఓ కుటుంబం దాడి చేసిన సంగతి తెలిసిందే. అయితే డాక్టర్లకి సేఫ్టీ ఎంతైనా అవసరమని భావించిన కేంద్ర ప్రభుత్వం ప్రతి ఆస్పత్రిలో ఆర్మీ జవాన్లకు డ్యూటీ వేసింది.


అలాగే కరోనా వైరస్ గురించి దుష్ప్రచారం చేసే దుర్మార్గులను అరెస్టు చేయాలని అన్ని రాష్ట్ర ప్రభుత్వాలకు ఆదేశాలు జారీ చేసింది. ఈ క్రమం లోనే గ్రేటర్ నోయిడా కు చెందిన ఇద్దరు వ్యక్తులు వాట్సాప్ గ్రూప్ లలో కరోనా వైరస్ గురించి తప్పుడు ప్రచారం చేస్తుండగా వారిని అరెస్ట్ చేశారు స్థానిక పోలీసులు. సామాజిక మాధ్యమాలలో షేర్ చేయబడుతున్న ప్రతి ఫోటో, వీడియో, సమాచారం అంతా వట్టి అబద్ధాలని... అవేమి అస్సలు నమ్మకూడదని కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు విజ్ఞప్తి చేసింది.


ఇకపోతే ఎక్కువగా కరోనా బాధితుల సంఖ్య నమోదైన రాష్ట్రాలు చూసుకుంటే...


మహారాష్ట్ర: 416

కేరళ: 286

తమిళనాడు: 234

ఢిల్లీ: 152

ఆంధ్రప్రదేశ్: 143

తెలంగాణ: 133

ఉత్తరప్రదేశ్: 103



ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు నమోదైన కరోనా కేసుల సంఖ్య ఒక్కసారి చూసుకుంటే...

ప్రపంచలో మొత్తం కేసులు: 962,650
మరణాలు: 49,183
రికవరీ కేసులు: 203,214

ఇండియాలో మొత్తం కేసులు: 2123
మరణాలు: 58
కొత్త కేసులు: 119
రికవరీ కేసులు: 148


తెలంగాణలో మొత్తం కేసులు: 133
యాక్టివ్ కేసులు: 103
మృతులు: 9
ఏపీలో మొత్తం కేసులు: 143
మృతులు: 0

ఇక ఏపీలో జిల్లాల వారీగా తీసుకున్నట్లైతే...
గుంటూరు: 20
నెల్లూరు: 21
ప్రకాశం: 17
కృష్ణా: 23
కడప: 16
పశ్చిమ గోదావరి: 14
విశాఖపట్నం: 11
తూర్పు గోదావరి: 9
చిత్తూరు: 9
అనంతపురం: 2
కర్నూలు: 1


క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle




Apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: