కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచం మొత్తం అతలాకుతలమవుతోంది. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ యూరోప్ మరియు అమెరికా దేశాలను వణికిస్తోంది. కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదవుతున్నాయి దేశంగా అమెరిక ముందుండగా ఎక్కువ మరణాలు సంభవిస్తున్న దేశాలుగా ఇటలీ మరియు స్పెయిన్ లలో మరణాల సంఖ్య రోజు రోజుకి విజృంభిస్తోంది. ముఖ్యంగా స్పెయిన్ విషయానికొస్తే చాలా చిన్నదేశం పైగా జనాభా తక్కువ వసతులు ఎక్కువ కలిగిన ఈ దేశంలో...కరోనా వైరస్ గురించి ప్రభుత్వం ప్రజలను నియంత్రించ లేకపోవటంతో భారీ మూల్యం చెల్లించింది. పైగా స్పెయిన్ ప్రిన్సెస్ అని గొప్పగా చెప్పుకునే మారియా థెరిసా కరోనా చికిత్స పొందుతూ మరణించారు. స్పెయిన్ లో ఇప్పటికే రోజుకి కొన్ని వందలాది మంది చనిపోతున్నారు. దానికి కారణం చూస్తే ప్రభుత్వం చెప్పిన ఆదేశాలను ప్రజలు లెక్క చేయకపోవడం మరియు అదే విధంగా ప్రభుత్వాలు ప్రజలను నియంత్రించ లేకపోవటం దీనివల్లే స్పెయిన్ దేశంలో మరణ మృదంగం వినబడుతుంది.

 

స్పెయిన్ కంటే ముందుగా ఇటలీలో ఈ విధమైన పరిస్థితులు నెలకొన్న సంగతి అందరికీ తెలిసినదే. కరోనా వైరస్ అంటే చాలా చిన్నగా తేలికగా తీసుకున్న ఇటలీ ప్రజలు భారీ మూల్యం చెల్లించుకున్నారు. ప్రభుత్వాలు లబోదిబోమంటూ ఎన్ని సూచనలు హెచ్చరికలు చేసినా ప్రజలు ఏమీ పట్టించుకోకుండా తమ ప్రాణాలను పోగొట్టుకున్నారు. ప్రస్తుతం ఇటలీలో రోజుకు వేల సంఖ్యలో మరణాలు సంభవిస్తున్నాయి.

 

మొత్తంమీద చూసుకుంటే ప్రపంచంలో ఈ వైరస్ ఇంత దారుణంగా ప్రబలడానికి కారణం చైనా దేశం ప్రధాన కారణం అయితే మరొకటి ప్రపంచ దేశాల ప్రభుత్వాలు మరియు అధినేతలు తమ ప్రజలను నియంత్రించ లేకపోవటం, చేతులారా చేసుకోవడం వల్ల ఇప్పుడు ప్రపంచమంతా భారీ మూల్యం చెల్లించకుండా పరిస్థితికి పరిణామాలు వ్యాపించాయి అని అంతర్జాతీయ స్థాయిలో వార్తలు వస్తున్నాయి. ఇప్పటికే ఫిలిప్పీన్స్ లో లాక్ డౌన్ టైం లో ఎవరైనా బయట కనబడితే కాల్ చేయాలని పోలీసులకు సైనికులకు ఆ దేశ అధ్యక్షుడు ఆదేశం ఇవ్వగా...ఇండియాలో ఏప్రిల్ మూడవ తారీఖు నుండి లాక్ డౌన్ సమయంలో కారణం లేకుండా బయట ఎవరు కనబడిన రెండు సంవత్సరాలు జైలు శిక్ష ఖరారు చేయబోతున్నట్లు వార్తలు వినపడుతున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: