జగన్ అధికారంలోకి రావడమే ఏపీ ఆర్ధిక పరిస్తితి దారుణంగా ఉన్న విషయం తెలిసిందే. గత ఐదేళ్లు అధికారంలో  ఉన్న చంద్రబాబు పెద్ద ఎత్తున అప్పులు చేయడం వల్ల రాష్ట్రంపై పెనుభారం పడింది. అయితే సీఎం అయిన దగ్గర నుంచి జగన్ కష్టపడుతూనే ఉన్నారు. ఆర్దిక పరిస్థితి బాగోకపోయిన ప్రజలకు మంచి చేసే విషయంలో ఏ మాత్రం వెనుకాడలేదు. దేశంలో ఏ సీఎం చేయని విధంగా ప్రజలకు అనేక సంక్షేమ పథకాలు అందించారు. అలాగే మూడు రాజధానులు తీసుకొచ్చి, రాష్ట్రాన్ని అభివృద్ధి చేద్దామనుకునే సమయంలోనే  కరోనా మహమ్మారి వచ్చింది. ప్రపంచాన్ని మొత్తం వణికిస్తున్న ఈ కరోనా ఏపీలో కూడా విజృంభిస్తుంది.

 

ఓ వైపు లాక్ డౌన్ ఉన్నా, కరోనా కేసులు సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే జగన్ మాత్రం ఎంత కష్టం ఉన్న, దాన్ని కనిపించనివ్వకుండా ప్రజల కోసం కష్టపడుతున్నారు. ప్రతిరోజూ ఈ కరోనా మహమ్మారిపై సమీక్షలు చేస్తూనే, ప్రజలకు జాగ్రత్తలు, ధైర్యం చెబుతున్నారు. ఇక కరోనా టెస్టుల కోసం ల్యాబ్‌లు పెంచారు. క్వారంటైన్, ఐసోలేషన్ వార్డ్స్ పెంచారు.  అలాగే ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ప్రజలకు మేలు చేసే విధంగా ముందుకెళుతున్నారు. ఇప్పటికే రేషన్ ఉచితంగా అందిస్తున్న జగన్, పేద ప్రజలకు రూ.1000 ఇవ్వడానికి సిద్ధమవుతున్నారు.

 

అయితే పూర్తిగా లాక్ డౌన్ కొనసాగుతున్న నేపథ్యంలో అసలే అంతంత మాత్రమే ఉన్న రాష్ట్ర ఆర్ధిక పరిస్థితి ఇంకా కుంటుపడింది. దీంతో తాజాగా, పి‌ఎం మోదీతో వీడియో కాన్ఫరెన్స్‌లో పాల్గొన్న జగన్, రాష్ట్రంలో కరోనా పట్ల తీసుకుంటున్న జాగ్రత్తలు చెబుతూనే, ఆర్దిక పరిస్థితి గురించి కూడా వివరించారు.  కరోనా కారణంగా రాష్ట్ర ఆదాయం బాగా దెబ్బతిందని, కాబట్టి రాష్ట్రానికి తగిన విధంగా ఆదుకోవాలి అని సీఎం జగన్ మోదీని కోరారు.

 

ఇక ఇలాంటి సమయాల్లో కేంద్రం సాయం చేస్తేనే రాష్ట్రం నిలబడగలుగుతుంది. లేదంటే రానున్న రోజుల్లో పరిస్థితి మరింత దిగజారుతుంది. అందుకే సీఎం జగన్ కూడా  కరోనా బీభత్సం సృష్టిస్తున్న సమయంలో, ప్రత్యేకంగా రాష్ట్రాన్ని ఆదుకోవాలని మోదీని వేడుకున్నారు.  మరి చూడాలి జగన్ రిక్వెస్ట్‌పై కేంద్రం స్పందించి ఏ మేర సాయం చేస్తుందో?

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Googlehttps://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: