కరోనా మహమ్మారి ప్రపంచంతో పాటు, ఇండియాలో కూడా విజృంభిస్తున్న విషయం తెలిసిందే. లాక్ డౌన్ కొనసాగుతున్న కరోనా కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. ఇప్పటికే 2 వేలు క్రాస్ చేసింది. తాజాగా కేంద్ర ఆరోగ్య మంత్రిత్వ శాఖ విడుదల చేసిన గణాంకాల ప్రకారం ఇందులో 1860 కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. 156 మంది ఇప్పటి వరకు కోలుకుని ఆసుపత్రుల నుంచి డిశ్చార్జ్ అయ్యారు. 53 మంది ప్రాణాలు కోల్పోయారు.

 

అయితే గత మూడు రోజుల నుంచే కరోనా కేసులు బాగా పెరిగాయి. ఢిల్లీలో నిజాముద్దీన్ మర్కజ్ ప్రార్థనలకు వెళ్లొచ్చిన వారికి కరోనావైరస్ సోకడం వల్లే రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య పెరిగింది. మెజారిటీ రాష్ట్రాల్లో ఈ ఢిల్లీకి పర్యటనకు వెళ్లొచ్చిన వారు ఉన్నారు. దాని వల్ల కేసుల సంఖ్య విపరీతంగా పెరుగుతుంది. అయితే ఈ కరోనా కేసులు ఎక్కువగా ఉన్న రాష్ట్రాల్లో మహారాష్ట్ర ముందుంది. ఆ రాష్ట్రంలో 400కు పైనే కరోనా కేసులు నమోదయ్యాయి.

 

ఇక మహారాష్ట్ర తర్వాత తమిళనాడు రెండో స్థానంలో ఉంది. ఆ రాష్ట్రంలో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య 309కి చేరింది. వీరిలో 264 మంది ఇటీవల ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్ కార్యక్రమానికి హాజరైనవారే. అంతేకాకుండా గత 24 గంటల్లో నమోదైన 75 పాజిటివ్ కేసుల్లో 74 మంది తబ్లీగీ జమాత్‌ కార్యక్రమానికి వెళ్లొచ్చిన వారే.

 

ఆ తర్వాత ఢిల్లీ, కేరళ రాష్ట్రాలు వరుసగా మూడు, నాలుగు స్థానాల్లో ఉన్నాయి. ఆ రాష్ట్రాల్లో కరోనా కేసులు సంఖ్య 300కు దగ్గరలో ఉన్నాయి. ఇక మొన్నటివరకు 25 లోపే కరోనా కేసులు ఉన్న ఏపీలో హఠాత్తుగా పాజిటివ్ కేసులు పెరిగిపోయాయి. రెండు, మూడు రోజుల్లోనే ఏపీలో కరోనా పాజిటివ్ కేసులు విపరీతంగా పెరిగాయి. 143 కేసులతో ఏపీ ఐదో స్థానానికి వచ్చేసింది. ఇక రాజస్తాన్ 133 కేసులతో ఆరో స్థానంలో ఉంటే, తెలంగాణ 127 కేసులతో ఏడో స్థానంలో ఉంది. నెక్స్ట్ కర్నాటక, ఉత్తర్ ప్రదేశ్, మధ్య ప్రదేశ్‌, గుజరాత్‌లు వరుసగా ఉన్నాయి. మొత్తానికైతే ఢిల్లీలోని నిజాముద్దీన్‌లో జరిగిన తబ్లీగీ జమాత్‌కు వెళ్లొచ్చిన వారి వల్లే ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు పెరిగాయి.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: