కరోనా వైరస్ ప్రపంచ దేశాలను చిగురుటాకులా వణికిస్తోంది. ఇప్పటికే ఈ కరోనా వైరస్ బారిన ఏకంగా 9 లక్షల 50 వేలమంది పడ్డారు.. అందులో 49 వేలమంది మృత్యువాత పడ్డారు. చైనాలోని వుహాన్ నగరంలో పుట్టిన ఈ కరోనా వైరస్ అగ్రరాజ్యాలను సైతం వణికిస్తోంది. అమెరికాలో, ఇటలీలో వేళలలో మృత్యువాత పడుతున్నారు. 

 

ఇంకా మన భారత్ విషయానికి వస్తే కరోనా వైరస్ పాజిటివ్ కేసులు 2,300 దాటిపోగా కరోనా వైరస్ మృతులు సంఖ్య మాత్రం ఇంకా పదుల సంఖ్యలోనే ఉంది. ఇలా తక్కువ ఉండటానికి కారణం కూడా మన కేంద్ర ప్రభుత్వం ముందస్తు నిర్ణయాలు అనే చెప్పాలి. ఎందుకంటే కరోనా వైరస్ వ్యాప్తి చెందకుండా దేశమంతా 21 రోజులు పాటు లాక్ డౌన్ విధించారు. 

 

అయితే అలాంటి ఈ కరోనా వైరస్ వ్యాప్తి చాలా తక్కువ ఉన్న సమయంలో ఒక్కసారిగా ఈ రెండు రోజుల్లో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య పెరిగింది. ఒక్క రెండు మూడు రోజుల్లోనే ఏకంగా వెయ్యి పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. అందుకు కారణం ఢిల్లీలో మర్కజ్ ప్రేయర్స్ కారణం అయ్యింది. 

 

ఇంకా ఈ నేపథ్యంలోనే తెలంగాణాలో ఇప్పటికే 127 కరోనా పాజిటివ్ కేసులు నమోదు కాగా ఈరోజు మరో 27 కరోనా పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. దీంతో కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య ఒక్కసారిగా 154కు చేరింది. అయితే ఈ 154లో ఇప్పటికి 17 మంది కోలుకోగా 9 మంది మృత్యువాత పడ్డారు. అలాగే ఈరోజు మరో ముగ్గురు డిశ్చార్జ్ అయ్యారు. తెలంగాణాలో కరోనా వైరస్ పరిస్థితి ఇలా ఉండగా ఏపీలో కరోనా వైరస్ పాజిటివ్ కేసుల సంఖ్య 133కు చేరింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: