కరోనా వైరస్ ఇండియాలో రోజురోజుకూ విజృంభిస్తున్న విషయం తెలిసిందే. ప్రస్తుతం దేశంలో లాక్ డౌన్ కొనసాగుతున్న, కరోనా పాజిటివ్ కేసుల సంఖ్య పెరుగుతూనే ఉంది. అయితే కరోనా వ్యాప్తి పెరగకుండా కేంద్రం గట్టి చర్యలే తీసుకుంటుంది. ప్రధాని మోదీ ఎప్పటికప్పుడు దేశంలో పరిస్థితులని సమీక్షిస్తూనే, ప్రజలకు కరోనా పట్ల అప్రమత్తంగా  ఉండాలని కోరుతున్నారు. ఇక తాజాగా అన్నీ రాష్ట్రాల సీఎంలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి, రాష్ట్రాల్లో కరోనా పట్ల ఎలాంటి చర్యలు తీసుకుంటున్నారో అడిగి తెలుసుకున్నారు.

 

అయితే ఈ సమయంలోనే కాంగ్రెస్ జాతీయ అధ్యక్షురాలు సోనియా గాంధీ కేంద్రం ప్రభుత్వానికి సలహాలు ఇస్తూనే, విమర్శలు చేశారు. 21 రోజుల లాక్ డౌన్ అత్యంత అనివార్యం అయినా కానీ కేంద్ర ప్రభుత్వానికి తగిన ప్రణాళిక లేకపోవడంతో వలస కుటుంబాలు, కూలీలు ఇబ్బందుల పాలవుతున్నారని, చిన్న, మధ్యతరహా పరిశ్రమలన్నీ మూతపడడంతో లక్షలాది మంది ఉపాధి కోల్పోయారని కేంద్రం వారిని ఆదుకోవాల్సిన అవసరముందని మాట్లాడారు.

 

ఇక సోనియా గాంధీ వ్యాఖ్యలకు ఊహించని విధంగా హోమ్ మంత్రి అమిత్ షా కూడా గట్టిగానే రియాక్ట్ అయ్యారు.  మోదీ నేతృత్వంలోని దేశం కరోనా మహమ్మారిపై పోరాడుతోందని, ఈ క్రమంలో 130 కోట్ల మంది ఒక్కటయ్యారని అమిత్ షా వ్యాఖ్యానించారు. ఈ సమయంలో కాంగ్రెస్ చిల్లర రాజకీయాలు చేస్తోందని, ఇలాంటి పరిస్థితుల్లో ప్రజలను తప్పుదోవపట్టించేలా వ్యాఖ్యానించడం సరికాదన్నారు.

 

అయితే ఇక్కడ సోనియా గాంధీ చెప్పిని పాయింటే. ఈ లాక్ డౌన్ వల్ల పేద ప్రజలు పెద్ద సంఖ్యలో ఇబ్బంది పడుతున్నారు. అలా అని కేంద్ర ప్రభుత్వం ఏమి పేదలని గాలికొదిలేయలేదు. తక్కువ ఆదాయం ఉన్న కుటుంబాలకు కిలో బియ్యం రూ.3, కిలో గోధుమలు రూ.2 కే అందిస్తుంది. మూడు నెలల పాటు ఈ సబ్సిడీ ధరలకే బియ్యం, గోధుమలను అందించనున్నారు. అటు వలస కూలీలని కూడా ఆదుకునే ప్రయత్నం చేస్తుంది. మొత్తానికైతే ఈ కరోనా వల్ల ఊహించని విధంగా సోనియా, అమిత్ షాల మధ్య మాటల యుద్ధం నడిచింది.  

మరింత సమాచారం తెలుసుకోండి: