కరోనా వైరస్ ప్రభావంతో ప్రపంచమంతా వల్లకాడుగా మారిపోయే ఇటువంటి పరిస్థితుల్లో విజయనగరం జిల్లాలో రాజకీయం కరోనా ని మించి హీట్ పెంచుతోంది. జిల్లాలో ఆధిపత్యం కోసం వైసీపీ పార్టీకి చెందిన ఇద్దరు కీలక నాయకులు రగడ సృష్టిస్తున్నారు. ఎవరికి వారు తామంటే తాము గొప్ప అన్నట్టుగా జిల్లాలో వ్యవహరిస్తున్నారు. దీంతో విజయనగరం జిల్లా రాజకీయాలు రోజుకో రకంగా మలుపు తిరుగుతున్నాయి. ఇద్దరు నాయకులకు అధ్యక్షుడు జగన్ అంటే మంచి అభిమానమే. వాళ్ళిద్దరూ మరెవరో కాదు సీనియర్ నాయకుడు మంత్రి బొత్స సత్యనారాయణ ఒకరు అయితే, మరొకరు ఇదే జిల్లాకు చెందిన సీనియర్ నాయకుడు ఎమ్మెల్యే కోలగట్ల వీరభద్రస్వామి.

 

ప్రస్తుతం వీరిద్దరి మధ్య విజయనగరం జిల్లా రాజకీయాలు నువ్వానేనా అన్నట్టుగా ఉన్నాయి. పచ్చగడ్డి వేస్తే ఇద్దరి మధ్య భగ్గుమనే పరిస్థితి నెలకొంది. వాస్తవంగా రాజకీయాల్లో వీరిద్దరిని గమనిస్తే, గతంలో 1999 నుంచి కాంగ్రెస్ లో ఉన్న నాయకులు. కాగా 2014 ఎన్నికల్లో కోలగట్ల వీరభద్రస్వామి వైసీపీ పార్టీలో చేరి ఆ టైంలో జరిగిన ఎన్నికల్లో పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత మెల్లగా బొత్స సత్యనారాయణ తన ఫ్యామిలీ తో సహా వైసీపీ పార్టీలో చేరారు. ఇద్దరి నాయకులకు కూడా జగన్ అంటే అభిమానమే. జిల్లా రాజకీయాల్లో వచ్చేసరికి ఆధిపత్యం కోసం ఒకరిపై ఒకరు పైచేయి సాధించాల‌ని తెగ ఆరాటపడుతున్నారు. అప్పటి నుండి వీరిద్దరి మధ్య ప‌గ‌లు ఉండ‌నే ఉన్నాయి.

 

గత సార్వత్రిక ఎన్నికల్లో వైసీపీ పార్టీ అధికారంలోకి వచ్చిన టైములో మామూలుగా అయితే విజ‌య‌న‌గ‌రం ఎమ్మెల్యే కోల‌గ‌ట్ల వీర‌భ‌ద్ర స్వామికి మంత్రి పదవి రావాలంట. కానీ బొత్ససత్యనారాయణ తనదయిన శైలిలో రాజకీయం చేయటంతో ఎమ్మెల్యే కోలగట్ల మంత్రి పదవి కోల్పోయారు. దీంతో విజయనగరం కార్పొరేషన్ కార్పొరేటర్ సీట్లన్నీ బొత్స సత్యనారాయణ అనుచరులకు రాకుండా ఎమ్మెల్యే కోలగట్ల సీట్లు అన్ని త‌న‌వారికే టికెట్లు ఇప్పించుకున్నారు. దీంతో ఇప్పుడు బొత్స సత్యనారాయణ ఎమ్మెల్యే కోలగట్ల ని ఎలాగైనా రాజకీయంగా జిల్లాలో తొక్కేయాలని ప్లాన్ చేస్తున్నట్లు వార్తలు వస్తున్నాయి.

మరింత సమాచారం తెలుసుకోండి: