కరోనా వైరస్ కి మందు లేకపోవడం తో, కేంద్ర ప్రభుత్వం నియంత్రించడానికి దేశ వ్యాప్తంగా లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. ప్రపంచ దేశాలలో ఈ వైరస్ ప్రభావం చాలా గట్టిగా ఉండటంతో చాలా వరకు ఆయా దేశాల ప్రభుత్వాలు లాక్ డౌన్ ప్రకటించడం జరిగింది. దీంతో ప్రపంచవ్యాప్తంగా ప్రజలంతా ఇళ్లకే పరిమితమయ్యారు. కాగా కేంద్ర ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయానికి పేద మరియు మధ్యతరగతి ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. రెండు తెలుగు రాష్ట్రాల ప్రజలకు చుక్కలు కనబడుతున్నాయి అని చెప్పవచ్చు. చాలా మంది తమ ఉపాధిని కోల్పోయి ఇంటికి పరిమితం కావడంతో…. అనుకోని ఈ పరిణామాలతో ఒక్కసారిగా ప్రజల జీవితాలు అస్తవ్యస్తంగా మారాయి. చాలా మంచి ఆహారం లేక తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

 

ఇటువంటి నేపథ్యంలో విద్యుత్ బిల్లుల విషయంలో పలు సంస్థలు కొన్ని కీలకమైన నిర్ణయాలు తీసుకుంటున్నాయి. కరోనా వైరస్ దృష్ట్యా ఏపీఎస్పీడీసీఎల్‌(విద్యుత్ సంస్థ) మార్చి నెల విద్యుత్‌ వినియోగానికి సంబంధించి వచ్చిన బిల్లునే ఏప్రిల్‌ బిల్లుకూ వర్తింపజేయాలని నిర్ణయం తీసుకుంది. ఈ విషయాన్ని వినియోగదారులకు ఎస్‌ఎంఎస్‌ల ద్వారా విద్యుత్‌ బిల్లులు పంపనున్నట్లు తాజాగా విడుదల చేసిన ఒక ప్రకటనలో సంస్థ పేర్కొంది.

 

ఈనెల 18 వరకు అపరాధ రుసుము లేకుండా చెల్లించే అవకాశం కల్పిస్తున్నట్లు ఏపీఎస్పీడీసీఎల్‌ తాజాగా ప్రకటన విడుదల చేసింది. అయితే ఈ తరుణంలో ఒక నెల బిల్లు అసలు సరిపోదు మూడు నెలలు ఆపాలి...ప్రస్తుత కష్టాలు నీకు ఏమీ అర్థం అవుతాయి. ప్రభుత్వాలు విద్యుత్ బిల్లుల విషయంలో పునరాలోచించాలని ఏపీ ప్రజలు కోరుతున్నారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: