కరోనా వైరస్ నీ అరికట్టడానికి అభివృద్ధి చెందిన దేశాలు అన్ని అట్టర్ ఫ్లాప్ అయ్యాయి. ప్రపంచానికి అగ్రరాజ్యం అని చెప్పుకునే అమెరికా కూడా కరోనా వైరస్ ముందు తలదించుకోవాల్సిన పరిస్థితి ఏర్పడింది. ప్రపంచవ్యాప్తంగా ఎక్కువ కరోనా పాజిటివ్ కేసులు నమోదవుతున్న దేశంగా అమెరికా మొదటి స్థానంలో ఉంది. శాస్త్రీయంగా ఇంకా చాలా విధాలుగా పేరొందిన దేశాలు కరోనా వైరస్ విషయంలో ఏమి చేయలేని పరిస్థితి ఏర్పడింది. ఇటువంటి పరిస్థితుల్లో కరోనా ని జయించిన దేశంగా అంతర్జాతీయ మీడియా సౌత్ కొరియా నీ కొనియాడుతోంది. చైనా దేశానికి దగ్గరగా ఉండే ఈ దేశం కరోనా వైరస్ బారిన పడినా గాని వెంటనే తేరుకుంది.

 

ప్రపంచ దేశాలు అన్నీ కూడా ఇప్పుడు దక్షిణ కొరియా వైపు చూస్తున్నాయి. ఈ నేపథ్యంలో దక్షిణ కొరియా క‌రోనాను జ‌యించిన వైనం గురించి స్పందించింది. క్వారెంటైన్, ప‌రీక్ష‌ల ద్వారానే క‌రోనాపై తాము పై చేయి సాధించిన‌ట్టుగా ద‌క్షిణ కొరియా ప్ర‌క‌టించింది. ఇలాంటి నేప‌థ్యంలో ప్ర‌పంచం ఒక విష‌యంలో ఈ దేశం సాయం కోరుతోంది. క‌రోనాను  నిర్ధారించ‌డం విష‌యంలో సౌత్ కొరియా వ‌ద్ద ప‌టిష్ట‌మైన ప‌రీక్షా యంత్రాలు ఉన్నాయ‌ని తెలుస్తోంది.

 

దీంతో ప్రపంచ దేశాలు అన్ని వాటి రూపకల్పన విషయంలో సహాయం చేయాలని సౌత్ కొరియా ని ప్రాధేయ పడుతున్నాయి. దీంతో ప్రపంచం మొత్తం ప్రస్తుతం డేంజర్ జోన్ లో ఉన్న టైంలో సౌత్ కొరియా ప్రపంచ దేశాలు విన్నవించుకున్నా కరుణా నిర్ధారణ యంత్రాల విషయంలో సౌత్ కొరియా అనుసరించిన ఫార్ములా ఇతర దేశాలతో పంచుకుంటే చాలా బాగుంటుందని..అంతర్జాతీయ స్థాయిలో ఒత్తిడి సౌత్ కొరియా పై వస్తుంది. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: