కరోనా కారణంగా చాలామంది భారతీయులు విదేశాల్లో చిక్కుకుపోయారు. లండన్‌లో మన భారతీయ విద్యార్థులు చిక్కుకుపోయారు. తమను ఎలాగైనా ఇండియాకు తీసుకురమ్మని వారు వేడుకుంటున్నారు. యు.కె.లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులను ఎలాగైనా ఆదుకోవాలంటూ జనసేన అధినేత పవన్ కల్యాణ్ కేంద్రాన్ని కోరినట్టు ఆ పార్టీ తెలిపింది.

 

 

కరోనా వైరస్ వ్యాప్తి తీవ్రంగా ఉన్న తరుణంలో యు.కె.లో చిక్కుకుపోయిన భారతీయ విద్యార్థులను అన్ని విధాలా ఆదుకోవాలని పవన్ కళ్యాణ్ చేసిన విజ్ఞప్తికి కేంద్ర ప్రభుత్వం సానుకూలంగా స్పందించిందని ఓ ప్రకటనలో తెలిపారు. గురువారం ఉదయం భారతీయ విద్యార్థుల భయాందోళనలను కేంద్ర విదేశీ వ్యవహారాల మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. సాయంత్రం పవన్ కల్యాణ్ తో కేంద్ర విదేశీ వ్యవహారాల శాఖ సహాయ మంత్రి శ్రీ వి.మురళీధరన్ ఫోన్ లో మాట్లాడారట.

 

 

యు.కె.లో చిక్కుకున్న భారతీయ విద్యార్థులకు అవసరమైన ఆహార, వసతి సమకూరుస్తామని కేంద్రమంత్రి హామీ ఇచ్చారట. కరోనా వ్యాప్తి మూలంగా వారు, వారి తల్లితండ్రులు ఆందోళనలో ఉన్నారనే విషయాన్ని పవన్ కల్యాణ్ చెప్పారట. లండన్ లో ఉన్న హై కమిషన్ కార్యాలయ అధికారులు ఆ విద్యార్థులకు సహాయం అందిస్తారని.. ఎవరూ ఆందోళన చెందవద్దని కేంద్ర మంత్రి పవన్ తో అన్నారట.

 

 

కేంద్రమంత్రి మురళీధరన్ జనసేన పార్టీ రాజకీయ వ్యవహారాల కమిటీ ఛైర్మన్ నాదెండ్ల మనోహర్ గారితోనూ ఈ అంశంపై ఫోన్ లో సంభాషించారట. లండన్ లోని భారత హైకమిషన్ కార్యాలయం పవన్ కల్యాణ్ విజ్ఞప్తికి స్పందించి అక్కడ చిక్కుకున్న విద్యార్థులకు సంబంధించిన వారి వివరాలు అందించాలని కోరిందట.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: