లాక్ డౌన్ నేపథ్యంలో బయటికి వచ్చిన సామాన్యుల పై కొందరు పోలీసుల ఓవర్ యాక్షన్ కొనసాగుతూనే వుంది. ఇటీవల  ఆంధ్రప్రదేశ్ లో ఓ యువకుడిని విచక్షణారహితంగా చితక బాదిన  ఘటన లో ఎస్ ఐ సస్పెండ్ కాగా తాజాగా అలాంటి ఘటనే ఈరోజు తెలంగాణ లోని వనపర్తి లో జరిగింది. పట్టణానికి చెందిన మురళీ కృష్ణ అనే వ్యక్తి తన కుమారిడితో కలిసి బైక్ పై  మూడు సార్లు రామాలయం నుండి ఆర్టీసీ బస్టాండ్ వరకు చక్కర్లు కొట్టాడు. ఇది గమనించిన కానిస్టేబుల్ అశోక్, బైక్ ను ఆపి మురళీకృష్ణ ను నిలదీశాడు దాంతో ఇద్దరి మధ్య మాట మాట పెరిగి రోడ్డు పైనే కొట్టుకున్నారు. అనంతరం మిగితా పోలీసులు బలవంతంగా మురళీకృష్ణ ను పోలీసు వాహనం లో ఎక్కించి స్టేషన్ కు తరలించారు. ఇక స్టేషన్ లో మురళీకృష్ణ పై తమ ప్రతాపాన్ని చూపించారు పోలీసులు. 
 
అయితే రోడ్డు మీద జరిగిన ఘర్షణ ను ఆ సమయంలో అక్కడే వున్న ఓ వ్యక్తి వీడియో తీసి ట్విట్టర్ లో మంత్రి కేటీఆర్ ను ట్యాగ్ చేస్తూ పోస్ట్ చేశాడు. ఈ వీడియో చూసిన కేటీఆర్, పోలీసుల పై ఆగ్రహాన్ని వ్యక్తం చేసి ఆఘటన పై విచారణ జరిపి చర్యలు తీసుకోవాలని హోం శాఖ మంత్రి ని డీజీపీని కోరారు. డీజీపీ ఆదేశాల మేరకు జిల్లా ఎస్పీ అపూర్వరావు ప్రాథమిక విచారణ అనంతరం కానిస్టేబుల్ అశోక్ ను సస్పెండ్ చేశారు. ఈవిషయాన్ని అపూర్వరావు , కేటీఆర్, డీజీపీ లకు తెలియజేశారు. 
 

మరింత సమాచారం తెలుసుకోండి: