కరోనా వైరస్ అరికట్టడంలో అగ్రరాజ్యం డొల్లతనం మొత్తం బయట పడింది. ఇటలీ దేశం మాదిరిగానే అమెరికా ప్రజలు కూడా కరోనా వైరస్ విషయంలో పెద్దగా పట్టించుకోలేదని అందువల్లే అక్కడ కరోనా వైరస్ పాజిటివ్ కేసులు నమోదు అవుతున్నట్లు అంతర్జాతీయస్థాయిలో వార్తలు వస్తున్నాయి. చైనా దేశంలో పుట్టిన ఈ వైరస్ అగ్రరాజ్యం అమెరికా అనే ప్రస్తుతం వణికిస్తోంది. ఇప్పటివరకు అగ్రరాజ్యంలో 2,15,215 కేసులు నమోదయ్యాయి. కేసుల సంఖ్య రోజుకు సగటున 1100 చొప్పున పెరుగుతున్నాయి. తాజా మరణాలతో కలిపి అమెరికాలో ఇప్పటివరకు 5110 మంది మరణించారు. 8878 మంది కోలుకున్నారు. ఇటలీ మరియు స్పెయిన్ దేశాలన్నీ కూడా అతలాకుతలం చేస్తోంది.

 

ప్రపంచంలోనే అత్యధిక మరణాలు ఇటలీలో కరోనా వైరస్ వల్ల చనిపోతుండగా పాజిటివ్ కేసులు మాత్రం అమెరికాలో నమోదవుతున్నాయి. అయితే అన్ని దేశాల మాదిరిగానే కరోనా వైరస్ సౌత్ కొరియా కి వ్యాపించిన గాని ప్రస్తుతం ఆ దేశం కరోనా వైరస్ నుండి పూర్తిగా బయటపడి ప్రపంచాన్ని ఆశ్చర్యపరిచింది. అంతేకాకుండా కరోనా బారినపడిన వారిలో మరణాల రేటు కూడా చాలా వరకు తగ్గిపోయింది. మొత్తంమీద చూసుకుంటే దక్షిణ కొరియాలో క‌రోనా వ్యాప్తి పూర్తిగా లేద‌నే ద‌శ‌కు వ‌చ్చింది.

 

ఈ నేప‌థ్యంలో ఇప్పుడు ప్రపంచం చూపు సౌత్ కొరియా మీద ప‌డింది. దీంతో ప్రపంచం మొత్తం ఎప్పుడు సౌత్ కొరియా వైపు చూస్తోంది. అయితే ఆ దేశంలో కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గటం గల కారణం ప్రజలను ఇళ్లకు పరిమితం చేసి..కట్టుదిట్టంగా వ్యవహరించడమే అని తెలిపింది. చాలా వరకు కరోనా వైరస్ పాజిటివ్ కేసులు తగ్గుతున్న దేశాలలో ఇదే ఫార్ములా కొనసాగుతుందని తేలింది. దీంతో అమెరికా ప్రభుత్వం కరోనా వైరస్ విషయంలో తమ ప్రజలను అప్రమత్తం చేయకపోవడమే పాజిటివ్ కేసులు నమోదు అవటానికి గల కారణం అని మొత్తం డొల్లతనం బయటపడింది. 



మరింత సమాచారం తెలుసుకోండి: