నిత్యం ఏదో ఒక వివాదాస్పద వార్తల్లో నిలుస్తూ చర్చనీయాంశంగా ఉంటారు డైరెక్టర్ రామ్ గోపాల్ వర్మ. సినిమా టైటిల్ ఎనౌన్స్ చేయాలన్న చాలా వెరైటీగా రామ్ గోపాల్ వర్మ ఆలోచిస్తుంటారు. అయితే ప్రస్తుతం కరోనా వైరస్ వల్ల టాలీవుడ్ ఇండస్ట్రీలో సినిమా షూటింగులు అన్ని ఆగిపోవటంతో సినిమా ఇండస్ట్రీ కి చెందినా ప్రముఖలంత ఇళ్లకే పరిమితమయ్యారు. కేంద్ర ప్రభుత్వం లాక్ డౌన్ విధించడంతో దేశవ్యాప్తంగా అన్ని సినిమా షూటింగులు ఆగిపోయాయి.

 

ప్రస్తుతం ప్రపంచవ్యాప్తంగా కరోనా వైరస్ పెద్ద హాట్ టాపిక్ కావడంతో నిత్యం వార్తల్లో నిలిచే రామ్ గోపాల్ వర్మ, తనకి కరోనా వచ్చిందని ఇటీవల సోషల్ మీడియాలో పోస్ట్ పెట్టి అందరిని ఏప్రిల్ ఫూల్ ని చేశాడు . ఇదే టైములో కరోనా వైరస్ పై పాట పాడతానని ప్రకటించినట్లుగానే కనిపించని పురుగు అని పాట పాడాడు. దీనికి లిరిక్స్ కూడా రామ్ గోపాల్ వర్మ రాయటం విశేషం. తాజాగా ఈ సాంగ్ సోషల్ మీడియాలో రిలీజ్ అయింది.

 

ప్రజలంతా ఇంటికే పరిమితం కావడం తో చాలామంది ఈ సాంగ్ విన్నారు. అయితే పాటకి వ్యూస్ వస్తున్నా గాని  విమర్శలు ఎక్కువగా ఉన్నాయ్. ఈ పాట విని నెటిజన్ల వింతవింతగా కామెంట్లు చేస్తున్నారు.కొందరైతే నీలో గాయకుడు ఉన్నారని అంటుంటే, మరికొందరు “ఈ పాట విని కరోనా వైరస్ ఆత్మహత్య చేసుకుంది” అని కామెంట్లు చేస్తున్నారు. ఇంకా చాలామంది రకరకాలుగా కామెంట్లు చేశారు. ప్రస్తుతం ఈ పాట సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. 



క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: