దేశ వ్యాప్తంగా కరోనా మృతులు పెరిగే అవకాశం ఉందా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. కరోనా వైరస్ ఇప్పుడు వేగంగా కదులుతుంది. తుఫాన్ వేగంతో ఇప్పుడు అందరిని ఈ వైరస్ చుట్టేసే పరిస్థితి ఏర్పడింది. ఏ చర్యలు తీసుకున్నా ఎన్ని కఠిన నిర్ణయాలు తీసుకున్నా సరే ఇది మాత్రం కట్టడి కావడం లేదు. కరోనా వైరస్ ని కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించినా సరే కేసులు అమాంతం పెరుగుతూనే ఉన్నాయి. 

 

 

కరోనా వైరస్ కట్టడి విషయంలో ఇప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు చాలా జాగ్రత్తగా వ్యవహరిస్తున్నాయి. కరోనా కట్టడి కోసం ఇప్పటికే ప్రత్యేక నిధులను కూడా కేటాయిస్తున్నారు. అయినా సరే దాన్ని కట్టడి చేసే విషయంలో విఫలం అవుతున్నారు అనే అభిప్రాయాలు ఎక్కువగా వినపడుతున్నాయి. ఇక ఇప్పుడు కరోనా వైరస్ కారణంగా మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని, రాబోయే రెండు వారాలు కూడా, 

 

 

దేశానికి చాలా కీలకం అంటున్నారు నిపుణులు. ఈ రెండు వారాల్లో కరోనా విరస్ ని ఎంత వరకు కట్టడి చేస్తారో... చూడాలని దాన్ని బట్టే దేశంలో కరోనా వ్యాప్తి ఆధారపడి ఉంటుంది అని, ఈ రెండు వారాల్లో గనుక కరోనా కట్టడి విషయంలో ఏ మాత్రం అలసత్వం ప్రదర్శించినా సరే ఇబ్బందులు వస్తాయని కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలకు సూచిస్తున్నారు. మన దేశంలో ఈ రెండు వారాల్లో లక్ష మందికి సోకే అవకాశాలు ఉన్నాయని పలువురు హెచ్చరించడం ఆందోళన కలిగిస్తుంది.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: