ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ వాలంటీర్లను ఎక్కువగా నమ్ముకున్నారా...? అంటే అవుననే సమాధానం వినపడుతుంది. వాలంటీర్ల విషయంలో ఎక్కువగా ముందు నుంచి ప్రచారం చేస్తున్న రాష్ట్ర ప్రభుత్వం కరోనా విషయంలో కూడా వాళ్లకు బాధ్యతలు అప్పగించింది. కరోనా విషయంలో వాళ్ళు సమర్ధవంతంగా పని చేస్తున్నారని వైసీపీ ఎంపీ విజయసాయి రెడ్డి కూడా సోషల్ మీడియాలో ఎక్కువగా ప్రచారం చేసారు. 

 

 

సోషల్ మీడియా వేదికగా పదే పదే వాళ్ళ గురించి ప్రస్తావిస్తూ జలుబు ఎవరికి ఉంది జ్వరం ఎవరికి ఉంది చెప్తామని ఆ సమాచారం అంతా ప్రభుత్వం వద్ద ఉందని ఆయన చెప్పారు. ఇప్పుడు అదే వాలంటీర్లు ఆంధ్రప్రదేశ్ ని నిలువునా ముంచారని విమర్శలు వస్తున్నాయి. కరోనా వైరస్ ని కట్టడి చేసే విషయంలో ఏపీ ప్రభుత్వం విఫలం కావడానికి ప్రధాన కారణం వాలంటీర్లను ఎక్కువగా నమ్మడమే అనే వ్యాఖ్యలు వినపడుతున్నాయి. 

 

 

అభివృద్ధి చెందిన దేశాలు కూడా ఇలాంటి చర్యలు చేయలేదు. ధర్మల్ స్క్రీనింగ్ చేసిన వాళ్లకు కూడా కరోనా వైరస్ లక్షణాలు బయటపడుతున్న తరుణంలో ఇళ్ళల్లో జ్వరం ఉంటే జలుబు ఉంటే ఆ సమాచారం ప్రభుత్వ౦ వద్ద ఉంటే ఏమి ఉపయోగం. పోనీ జలుబు జ్వరం ఉన్న వాళ్ళను క్వారంటైన్ కి ఏమీ తరలించలేదు. ఇప్పుడు వాలంటీర్లను ఎక్కువగా నమ్మడమే రాష్ట్రంలో కేసులు పెరగడానికి కారణమని పలువురు అంటున్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNappl

 

మరింత సమాచారం తెలుసుకోండి: