ప్రపంచమంతా ఇప్పుడు కరోనా భయంతో వణికిపోతోంది. ఓవైపు కేసులు గణనీయంగా పెరిగిపోతున్నాయి. బయటకు వస్తే చాలు కరోనా రిస్క్ వణికిస్తోంది. ఎటు నుంచి ఎవడి ద్వారా కరోనా సోకుతుందో అన్న టెన్షన్ తో జనం సగం చచ్చిపోతున్నారు. దేశమంతా లాక్‌ డౌన్ తో జనం ఇళ్లకే పరిమితం అయ్యారు. కొన్ని అత్యవసర సేవల వాళ్లు తప్ప మిగిలిన వాళ్లంతా ఇళ్లకే పరిమితం అయ్యారు.

 

 

ఈ అత్యవసర సేవల్లో బ్యాంకులు కూడా ఉన్నాయి. వాళ్లకూ డ్యూటీలు తప్పడం లేదు. అత్యవసర సర్వీసు కదా .. డ్యూటీ చేయక తప్పదు కదా అన్న భయంతో ఎలాగోలా బ్యాంకు ఉద్యోగులు ఆఫీసులకు వెళ్తున్నారు. అయితే ఈ సమయంలో బ్యాంకుల యాజమాన్యాల తీరు చిత్రంగా ఉంది. కొత్త ఆర్థిక సంవత్సరం ప్రారంభం కావడంతో టార్గెట్లు అందుకోవాలని అప్పుడే ఉద్యోగులపై ఒత్తిడి పెంచేశారు.

 

 

కొన్ని ప్రైవేటు బ్యాంకు యాజమాన్యాలకు కరోనా’పట్టింపు లేదు. అప్రమత్తంగా ఉండాలనే హెచ్చరికలను పట్టించు కోవడం లేదు. ఉద్యోగులకు మాత్రం టార్గెట్‌’విధిస్తూ బిజినెస్‌ పెంచాలని ఒత్తిడి తెస్తున్నాయి. క్రితం ఏడాది ఎంత బిజినెస్‌ జరిగిందో అంతకు ఒకటిన్నర రెట్లు కొత్త సంవత్సరంలో జరగాలని టార్గెట్ ఫిక్స్ చేస్తున్నాయి. రోజూ కాన్ఫరెన్స్, వీడియోకాల్స్‌ ద్వారా సమావేశాలు ఏర్పాటు చేస్తూ కొత్త టార్గెట్లు ఫిక్స్ చేస్తున్నాయి.

 

 

తమ యాజమాన్యాల తీరు చూసి బ్యాంకు ఉద్యోగులు ఠారెత్తిపోతున్నారు. అసలు కరోనా కారణంగా ఎవరో అత్యవసర అవసరం ఉన్న వాళ్లు తప్పితే ఎవరూ బ్యాంకుకు రావడం లేదు. అన్ని వ్యాపారాలు మూతబడ్డాయి. ఒక విధంగా ప్రపంచమే స్తంభించింది. ఇలాంటి గడ్డు సమయంలో అసలు ఆఫీసుకు రావడమే గొప్పరా అంటే.. ఈ టార్గెట్ల గోలేంట్రా బాబూ అని మొత్తుకుంటున్నారు. అయితే చాలా బ్యాంకులు ప్రభుత్వానికి కోట్ల కు కోట్ల విరాళం ఇచ్చిననందున ఆ లోటు పూడ్చుకునేందుకే ఈ కొత్త టార్గెట్లన్న విమర్శలు ఉన్నాయి.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: