అగ్రరాజ్యాల ఆధిపత్య పోరులో ప్రపంచం అతలాకుతం అవుతుంది.. ఒక్క తప్పటడుగు లక్షలమంది ప్రాణాలు, కోట్ల జనానికి కష్ట నష్టాలు... ప్రపంచదేశాలకు ఇబ్బందులు.. ఆర్ధిక రధ చక్రం వేగానికి అడ్దుపడింది.. ఇప్పుడు వైరస్ వస్తుందని భయపడాలో లేక, రానున్న రోజుల్లో బ్రతుకు భారంగా మారుతుందని ఏడువాలో అర్ధం కాని పరిస్దితి సామాన్య మానవుని కళ్ల ముందు నిలిచింది.. ఏదో సాధిద్దామని ఒక దేశం సృష్టించిన చిన్న పురుగు, అన్ని దేశాలను సాధిస్తూ నాశనం చేస్తుంది.. అమెరికా పై ఆధిపత్య పోరుకు, చైనా వేసిన పన్నాగం ఫలించిన దీని వల్ల అన్ని దేశాలు కోలుకోలేని విధంగా నష్టాలను చవిచూస్తున్నాయి..

 

 

ముఖ్యంగా జనాభ ఆరుకోట్ల వరకు ఉన్న ఇటలీలో ఇప్పటికి పరిస్దితి మెరుగుపడలేదు.. ఇదే కాక చైనా చుట్టుపక్కలి దేశాలుకూడా తీవ్రంగా నష్టపోతున్నాయి.. ఇక అమెరికా సంగతి చెప్పక్కర్లేదు.. ఈ వైరస్ వెలుగులోకి వచ్చిన కొద్ది రోజులకు చైనా వుహాన్‌ నగరంలో లాక్‌డౌన్‌నూ ప్రకటించింది. కానీ, అత్యంత అధునాతన సమాచార వ్యవస్థ కలిగిన అమెరికా మేలుకోలేదు. యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆరోగ్య నిపుణులు హెచ్చరించారు. దురదృష్టవశాత్తు ప్రభుత్వం సమర్థ చర్యలు తీసుకోలేదు. వెంటనే చైనా నుంచి వచ్చే విమానాలను నిషేధించడం గాని, వచ్చిన వారిని పూర్తి పర్యవేక్షణలో ఉంచడం లాంటి తక్షణ చర్యలు చేపట్టక పోవడం గమనార్హం. అలా తన నిర్లక్ష్యం వల్ల సులువుగా దాదాపు నెల రోజులు గడిచాయి..

 

 

ఫిబ్రవరి 29న మొదటి కరోనా మరణం సియాటిల్‌ శివారులో సంభవించడంతో అమెరికా మొత్తం ఉలిక్కిపడింది. అప్పటి దాకా ప్రభుత్వ చర్యలు నిమ్మకు నీరెత్తినట్లుగా సాగడంతో అప్పటికే వైరస్‌ వ్యాప్తి చాపకింద నీరులా విస్తృతమైంది. అప్పటికే  జరగరాని ఘోరం జరిగిపోయింది. ఇక్కడ ఒక్క విషయం ప్రతి వారు గమనించాలి.. ఇలాంటి అంటువ్యాధుల విషయంలో ప్రతిరోజూ, ప్రతిక్షణం విలువైనదే.. తెలికగా తీసుకుంటే వీటివల్ల వచ్చే ఉపద్రవాన్ని ఎదుర్కొనడం చాలా కష్టం.. ఇక అమెరికా మెలుకొనే లోపే వైరస్‌ వ్యాప్తి మరింత లోతుగా చొచ్చుకుపోయింది.

 

 

వాషింగ్టన్‌ ప్రాంతంలో దాదాపు 50 మందికి పైగా అప్పటికే మరణించారు. ఇక వెంటవెంటనే ప్రజలకు కరోనా పరీక్షలన్నీ విస్తృతంగా అందుబాటులోకి వచ్చేటప్పటికి.. తూర్పు తీరంలోని ఇంగ్లాండ్‌ ప్రాంతం, న్యూయార్క్‌ నగరం, న్యూజెర్సీల్లో వేలల్లో కరోనా కేసులు బయటకొచ్చాయి. ఇలా ఒక్కసారిగా అమెరికాలో కేసులు పెరగడం ప్రపంచాన్ని ఆశ్చర్యపరచింది. ఇకపోతే ఆరోగ్య నిపుణులు మొదట్నుంచీ ఇలా జరిగే అవకాశం ఉందని చెబుతూనే ఉన్నారు. కానీ ప్రభుత్వమే మొదట్లో పెడచెవిన పెట్టడంతో తీవ్ర పరిస్థితి నెలకొంది.. ఇప్పుడు అమెరికాని చూసి ప్రపంచదేశాలు.. ప్రమాదం చిన్నదైనా అతి జాగ్రత్తగా ఉండాలని గ్రహించాలి.. 

మరింత సమాచారం తెలుసుకోండి: