కరోనా వైరస్‌ను కట్టడి చేసేందుకు కేంద్ర ప్రభుత్వం దేశ వ్యాప్తంగా లాక్ డౌన్‌ను అమలు చేస్తున్న సంగతి తెలిసిందే. దాదాపు ప్రతి రాష్ట్రంలోనూ చాలా మంది బాధ్యత లేకుండా లాక్ డౌన్ ఉల్లంఘిస్తూ రోడ్లపైకి వస్తున్నారు.  బయటికి రాకండి.. కరోనా సోకే ప్రమాదం ఉందని చెబుతున్నా హైదరాబాద్ ప్రజలు వినిపించుకోవడం లేదు.  లాక్ డౌన్ విధిస్తున్నా పట్టించుకోవడం లేదు. పోలీసుల కళ్లు గప్పి రోడ్లపై దర్జాగా తిరుగుతున్నారు. రాష్ట్రంలో కరోనా కేసులు ఒక్కసారిగా పెరిగిపోవడంతో పోలీసులు ప్రజల్ని హెచ్చరిస్తున్నా.. ఏమీ పట్టనట్లు వ్యవహరిస్తున్నారు.  హైదరాబాద్ సిటీలో రోజూ వేలల్లో లాక్ డౌన్ రూల్స్ బ్రేక్ చేస్తున్నారు.

 

ముఖ్యంగా పోలీసుల నిఘా తక్కువగా ఉన్న ప్రాంతాల్లోని రోడ్లపై వెహికల్స్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌తో యథేచ్ఛగా తిరుగుతున్నారు. నిత్యావసరాల కోసం ఉదయం నుంచి సాయంత్రం వరకు ఇష్టమొచ్చినట్లు బయటకు వస్తున్నారు.  మరోవైపు, దేశంలోనూ కరోనా వైరస్ కేసులు పెరుగుతున్నందుకు కేంద్ర ప్రభుత్వం కఠిన చర్యలకు సిద్ధమైంది. లాక్‌డౌన్ నిబంధనలను ఉల్లంఘించిన వారిపై కఠిన చర్యలను తీసుకునేందుకు కేంద్రం నిర్ణయించింది. అందులో భాగంగానే కేంద్ర హోంశాఖ కార్యదర్శి అజయ్ భల్లా అన్ని రాష్ట్రాల ప్రధాన కార్యదర్శులు, కేంద్ర పాలిత ప్రాంతాలకు లేఖ రాశారు.  . ఏ నిబంధన ఉల్లంఘించిన వారిపై ఏ చర్య తీసుకోవాలనే విషయాన్ని చెబుతూ పూర్తి జాబితాను రాష్ట్రాలకు పంపించారు.

 

ఇదిలా ఉంటే.. బైక్‌పై కుమారుడితో కలిసి బయటకు వచ్చిన వ్యక్తిని చిన్నారి ఎదుటే చితకబాదిన కానిస్టేబుల్‌ సస్పెండయ్యాడు. తెలంగాణలోని వనపర్తి జిల్లాలో జరిగిన ఈ ఘటనకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయింది. ఈ వీడి ఓ వ్యక్తి సోషల్ మాద్యం ద్వారా  మంత్రి కేటీఆర్, ఎస్పీ, డీజీపీలను ట్యాగ్ చేశాడు. మంత్రి కేటీఆర్ దృష్టికి తీసుకు పోవడంతో  ఆయన సైతం సీరియస్ కావడం జరిగింది.  

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: