కొవిడ్‌-19 క‌ట్ట‌డి చేసేందుకు పెద్ద‌పెద్ద కార్పొరేట్‌ సంస్థ‌లు ముందుకు వ‌స్తున్నాయి. దేశాల‌కు భారీగా విరాళాలు ప్ర‌క‌టిస్తున్నాయి. క‌రోనా వైర‌స్ వ్యాప్తి నిరోధానికి అవ‌స‌ర‌మైన చ‌ర్య‌లు తీసుకునేందుకు, ప్ర‌జ‌లు ఇబ్బందులు ప‌డ‌కుండా.. వారికి అవ‌స‌ర‌మైన క‌నీస అవస‌రాలు తీర్చేందుకు ఈ సాయాన్ని దేశాల‌కు అంద‌జేస్తున్నాయి. ఈ క్ర‌మంలోనే  ప్ర‌పంచంలో క‌రోనా ప్ర‌భావం తీవ్రంగా ప‌లు దేశాల‌కు ప్రపంచ బ్యాంక్ కూడా భారీగా ఆర్థికసాయం ప్రకటించింది. 25 దేశాలకు 1.9 బిలియన్‌ డాలర్ల సాయం ప్రకటించింది. ఈ అత్యవసర ఆర్థికసాయంలో అత్యధికంగా భారత్‌కు 1 బిలియన్‌ డాలర్లను కేటాయిస్తూ గురువారం జ‌రిగిన‌ బోర్డ్‌ ఆఫ్‌ ఎక్స్‌గ్యూటివ్‌ డైరెక్టర్స్‌ సమావేశంలో నిర్ణయం తీసుకున్నారు. స్క్రీనింగ్‌, కాంటాక్ట్‌ ట్రేసింగ్‌, లాబోరేరీల ఏర్పాటు, డయాగ్నోస్టిక్స్‌, పీపీఈల కొనుగోలు, ఐసోలేషన్‌ వార్డుల ఏర్పాటుకు ఆయా దేశాలు ఈ నిధులను వినియోగించనున్నారు. 

 

ఇందులో  భారత్‌కు అత్య‌ధికంగా 1 బిలియన్‌ డాలర్ల ఆర్థికసాయాన్ని ప్ర‌పంచ బ్యాంకు ప్ర‌క‌టించింది. పాకిస్తాన్‌కు 200 మిలియన్‌ డాలర్లు, ఆఫ్గనిస్థాన్‌కు 100 మిలియన్‌ డాలర్లు, మాల్దీవులకు 7.3 మిలియన్‌ డాలర్లు, శ్రీలంకకు 128.6 మిలియన్‌ డాలర్ల ఆర్థిక సాయాన్ని ప్ర‌పంచ బ్యాంకు ప్రకటించింది. అదేవిధంగా ఆర్థిక వ్యవస్థ పురోగతికి, ప్రజల ఆరోగ్య పరిరక్షణకు రానున్న 15 నెలల్లో 160 బిలియన్‌ డాలర్ల ఆర్థిక ప్యాకేజీపై ప్రపంచబ్యాంక్‌ కసరత్తులు చేస్తున్న‌ట్లు ప్ర‌క‌టించింది. ఈ మొత్తాన్ని దారిద్య్ర నిర్మూలనపై, నిరుపేద కుటుంబాలను ఆదుకునేందుకు, పర్యావరణాన్ని పరిరక్షించేందుకు వెచ్చిచ్చనున్నట్లు బ్యాంకు పేర్కొంది. ఇక ఇప్ప‌టివ‌ర‌కు ప్ర‌పంచ వ్యాప్తంగా ప‌దిల‌క్ష‌ల మందికిపైగా క‌రోనా బారిన ప‌డ‌గా, 53వేల మందికిపైగా క‌రోనాతో మృతి చెందారు. ఇట‌లీ, స్పెయిన్‌, చైనా, అమెరికా, ఇరాన్ దేశాల్లోనే మృతుల సంఖ్‌య‌ ఎక్కువ‌గా ఉంది. భార‌త్‌లో 2543 మంది క‌రోనా బారిప‌డగా, 72మంది మృతి చెందారు. ఢిల్లీలోని మ‌ర్క‌జ్ ఉదంతం త‌ర్వాత‌నే భార‌త్‌లో క‌రోనా ప్ర‌భావం ఎక్కువ‌గా క‌నిపిస్తోంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: