ప్రధాని మోదీ ప్రజలనుద్దేశించి ప్రసంగిస్తూ కరోనాపై యుద్ధం చేస్తున్న దేశ ప్రజలందరికీ ధన్యవాదాలు తెలిపారు. కరోనాను నియంత్రించటానికి దేశ ప్రజలంతా ఒక్కటిగా నిలిచారని అన్నారు. దేశ ప్రజలందరూ లాక్ డౌన్ కు సహకరించారని చెప్పారు. దేశ ప్రజలంతా ఏకమై కరోనాను తరిమి కొడదామని అన్నారు. ప్రతి ఒక్కరూ ఇంట్లోనే ఉంటే కరోనాను జయించినట్లే అని చెప్పారు. ప్రపంచ దేశాలకు భారత్ ఆదర్శంగా నిలిచిందని అన్నారు. 
 
ఏప్రిల్ 5న దేశ ప్రజలంతా జాగరణ చేయాలని... రాత్రి 9 గంటలకు ప్రజలందరూ జ్యోతులు వెలిగించాలని చెప్పారు. 9 నిమిషాల పాటు ప్రతి ఒక్కరూ జ్యోతులను వెలిగించి ఉంచాలని అన్నారు. ఇళ్లలోని విద్యుత్ దీపాలను బంద్ చేసి ప్రజలు జ్యోతులను వెలిగించాలని సూచించారు. ప్రతి ఒక్కరూ జ్యోతులు వెలిగించి బాల్కనీలోకి రావాలని చెప్పారు. రాబోయే 11 రోజులు ప్రజలు సహకరించాలని కోరారు. 
 
రాబోయే 11 రోజులే అత్యంత కీలకమైనవని మోదీ అన్నారు. 130 కోట్ల మంది ప్రజలు ఒక్క తాటిపై నిలిచి 9 నిమిషాల పాటు జ్యోతులు వెలిగించి సమిష్టిగా సందేశాన్ని ఇద్దామని అన్నారు. కరోనాపై విజయానికి నాందిగా దీనిని జరపాలని అన్నారు. 
 
 
 

మరింత సమాచారం తెలుసుకోండి: