అమ్మపిలుపు అనేది జీవితకాలం అందరికి దక్కని వరం.. తల్లిదండ్రుల విలువ తెలియాలంటే వారిని కోల్పోయిన అనాధలను అడిగితే తెలుస్తుంది.. నేటికాలంలోని యువతలో కొందరు తల్లిదండ్రులంటే గడ్దిలో పోచలాగా చూస్తున్నారు.. ఇకపోతే ఈ సమాజంలో కొందరి బ్రతుకులు చూస్తే చాలా ధీన స్దితిలో కనిపిస్తాయి.. సామాన్యులు అయ్యోపాపం అనడం తప్పితే ఏం చేయగలరు.. ఇక కుటుంబానికి పెద్దదిక్కులేని వారి పరిస్దితి చూస్తే మాత్రం కన్నీరు ఆగదు.. ఇక్కడ ఓ కుటుంబానికి ఇలాంటి కఠిన పరీక్ష ఎదురైంది.. ఈ న్యూస్ మొత్తం చదివితే మీకే అర్ధం అవుతుంది..

 

 

పాపం ఇలాంటి వారు లోకంలో ఇంకా ఎందరో ఉన్నారు.. ఇకపోతే భర్తను కోల్పోయిన ఓ మహిళ, కూలీ పనులు చేసుకుంటు తన నలుగురు బిడ్డలను పోషిస్తోంది. రెక్కాడితే గానీ డొక్కాడని పరిస్థితి వీళ్లది.. ఇలాంటి వారి జీవితాల్లోకి యమునిలా ప్రవేశించిన కరోనా.. వీరిలాంటి వారి జీవితాలను చిద్రం చేస్తుంది.. ఎందుకంటే ఇప్పుడు రాష్ట్రం లాక్‌డౌన్ అమలులో ఉంది.. ఇది ఆమె పరిస్థితిని తలక్రిందులు చేసింది. 10 రోజులుగా పనులు లేకపోవడంతో తన బిడ్డలకు తిండి పెట్టలేక సతమతమైంది. దీనికి తోడు అనారోగ్యానికి గురికావడంతో పట్టించుకునే నాథుడు లేడు.

 

 

ఇకపోతే పిల్లలందరూ పదేళ్ల వయస్సు లోపువారే కావడం తన తల్లికి వచ్చిన వ్యాధి ఏంటో గుర్తించలేకపోయారు.. ఇక లాక్‌డౌన్ కారణంగా స్థానికులెవరూ కూడా ఆమె పరిస్థితిని గమనించలేదు తాను పిల్లల కోసం బ్రతాకలనుకున్నా ఆ విధి మాత్రం చిన్న చూపు చూసింది. దీంతో పిల్లలను ఒంటరి వాళ్లను చేసి బుధవారం కన్నుమూసింది. ఏం జరిగిందో అర్ధంకాక పిల్లల ఏడ్చుకుంటూ తల్లి పక్కన కూర్చున్నారు.. వారి ఏడుపులు విన్న స్థానికులు ఏం జరిగిందని ఆరా తీయగా అమ్మ చనిపోయిందని చెప్పడంతో అందరూ విషాదంలో మునిగిపోయారు. ఇక లాక్‌డౌన్ వేళ కన్నీరు పెట్టించే ఈ ఘటన సికింద్రాబాద్, చిలకలగూడ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో వెలుగు చూసింది. మృతురాలి పేరు రాధ(28)..

 

 

తల్లి మరణంతో తమవారు ఎవరో తెలియని ఆ చిన్నపిల్లలు అనాధలైయ్యారు.. కాగా ఇంటి యజమాని స్థానికుల సాయంతో మృతదేహాన్ని బయటకు తరలించాడు. అయితే ఆమె సంబంధీకుల వివరాలు తెలియకపోవడంతో గురువారం మధ్యాహ్నం వరకు మృతదేహం అక్కడే ఉండిపోయింది. చివరికి దుర్వాసన రావడంతో స్థానికులు చిలకలగూడ పోలీసులకు సమాచారం ఇచ్చారు. కాసేపటికే వారు అక్కడికి చేరుకుని వివరాలు ఆరా తీశారు. కానీ వివరాలు ఏవి వారికి లభించలేదు..

 

 

అదీగాక పిల్లలు కూడా బంధువుల వివరాలు చెప్పలేక పోవడంతో పోలీసులు మున్సిపాలిటీ సిబ్బంది సాయంతో మృతదేహాన్ని తరలించి అంత్యక్రియలు నిర్వహించారు. బంధువుల సమాచారం తెలుసుకుని నలుగురు పిల్లలను వారికి అప్పగిస్తామని అధికారులు చెబుతున్నారు. ఇకపోతే తన తల్లి మృతదేహం వద్ద నలుగురు పిల్లలు రోదిస్తున్న తీరు మనసున్న ప్రతివారిని కంటతడి పెట్టించింది... చూసారా అందరి తలరాతలు ఒకేలా ఉండవు.. హాయిగ బ్రతుకుతున్న వారికి ఇలాంటి కష్టాలు తెలియవు.. అందుకే ఈ జీవితంలో ఎదురయ్యే ప్రతి సంఘటనను ఒక పాఠంలాగా స్వీకరించాలి కాని నిర్లక్షంగా ఉండకూడదు.. తల్లిదండ్రుల్ని హేళన చేయకూడదు.. 

మరింత సమాచారం తెలుసుకోండి: