ప్రపంచం మొత్తం ఇప్పుడు కరోనా చేస్తున్న కరాళ నృత్యం చెప్పనలవి కాకుండా ఉంది.  కరోనా మహమ్మారి తుమ్మినా లేదా దగ్గినా ఒకరి నుంచి మరొకరికి వ్యాపిస్తుందని ఇంతకాలమూ భావిస్తూ రాగా, తాజా అధ్యయనంలో మాట్లాడినా లేదా, కరోనా సోకిన వ్యక్తి పక్కనే ఉండి గాలిని పీల్చుకున్నా కూడా వైరస్ సోకే ప్రమాదముందని తేలింది.  ఈ విషయం యూఎస్ లోని నేషనల్ అకాడమీ ఆఫ్ సైన్స్, డాక్టర్ హార్వే ఫినెబర్గ్ అధ్యక్షతన ఓ కమిటీని వేయగా, వారు రీసెర్చ్ నిర్వహించి, దాని ఫలితాలను వైట్ హౌస్ కు తెలిపారు.

 

 

ఏదో ఒక మాస్క్ వేసుకునే బయటకు కాలు పెట్టడం మంచిదని తాను అభిప్రాయపడుతున్నట్టు డాక్టర్ హార్వే ఫినెబర్గ్ సీఎన్ఎన్ వార్తా సంస్థకు తెలిపారు.  సాధారణంగా పీల్చే ఊపిరితోనూ వైరస్ క్రిములు శరీరంలోకి  చాలా తక్కువ వెళుతున్నాయని  ఫినెబర్గ్ అభిప్రాయ పడ్డారు.  ఓ సర్జికల్ మాస్క్ ను ధరించాలని నేను భావించడం లేదు. ఎందుకంటే,  వైద్యులకు వాటి అవసరం ఎంతైనా ఉంది. అయితే, ముక్కు, నోటికి ఏదో ఒక ఆచ్చాదన మాత్రం వుండాలి  అని హార్వార్డ్ స్కూల్ పబ్లిక్ హెల్త్ విభాగం మాజీ డీన్ గానూ పని చేసిన ఫినెబర్గ్ తెలిపారు. 

 

అయితే ఈ విషయం జనాలకు తెలియాల్సిన అవసరం ఉందని.. కరోనాని కట్టడి చేయడానికి ఎన్నో రకాల జాగ్రత్తలు తీసుకుంటున్నారని... కొంత మంది నిర్లక్ష్యం వల్ల ఈ కరోనా వ్యాప్తి చెందుతూ వస్తుందని అన్నారు.  ప్రపంచంలో రోజు రోజు కీ కరోనా కేసులు పెరగడానికి ముఖ్యకారం ప్రజల దీనిపై పూర్తి అవగాహన రాకపోవడం కారణం అని హార్వార్డ్ స్కూల్ పబ్లిక్ హెల్త్ విభాగం మాజీ డీన్ గానూ పని చేసిన ఫినెబర్గ్ తెలిపారు.  కరోనా సోకిన రోగికి ఆరు అడుగుల దూరంలో ఉన్న వ్యక్తికి కూడా తుమ్ము లేదా దగ్గు వల్ల వైరస్ వ్యాపిస్తుందని యూఎస్ సెంటర్ ఫర్ డిసీజెస్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ పేర్కొంది.

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.


Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: