ప్రపంచ వ్యాప్తంగా కరోనా తన పంజాను విసిరింది. ఇప్పటికే కొన్ని దేశాల్లో కరోనాను అరికట్టడానికి లాక్ డౌన్ విధించారు. అలాగే ప్రస్తుతం భారతదేశం మొత్తం లాక్ డౌన్ లో కొనసాగుతోంది. మన దేశంలో లాక్ డౌన్ 2020, మార్చి 25వ తేదీ నుంచి అమలవుతోంది. కరోనా వైరస్ వ్యాప్తిని అడ్డుకొనేందుకు కేంద్రం ఈ చర్యలు తీసుకొంది. 

 

వైరస్ వ్యాప్తి చెందకుండా.. ప్రజలు ఇళ్లలోనే ఉండాలని ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ కోరారు. దీంతో జనజీవనం స్తంభించిపోయింది. ఎక్కడికక్కడనే రవాణా వ్యవస్థ స్తంభించిపోయింది. 2020, ఏప్రిల్ 14వ తేదీ వరకు లాక్ డౌన్ అమలు కానుంది.

 

అయితే గడువు సమీపిస్తుండడంతో అందరి దృష్టి  లాక్ డౌన్ పై నెలకొంది. దేశంలో కరోనా కేసుల సంఖ్య ఏ మాత్రం తగ్గడం లేదు. రోజురోజుకు అధిక సంఖ్యలో కేసులు నమోదవుతుండడం తీవ్ర ఆందోళన వ్యక్తమౌతోంది. మరి ఈ తరుణంలో లాక్ డౌన్ విషయంలో ఎలాంటి నిర్ణయం తీసుకుంటారనే దానిపై ఉత్కంఠ నెలకొంది. 

 

దేశవ్యాప్త దిగ్బందాన్ని దశలవారీగా ఎత్తివేసే దిశగా ఆలోచిస్తున్నట్లు ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ వెల్లడించారు. 2020, ఏప్రిల్ 02వ తేదీ గురువారం రాష్ట్రాల ముఖ్యమంత్రుల సమావేశంలో మోడీ ఈ వ్యాఖ్యలు చేశారు.

 

దశలవారీగా ఎత్తివేసేందుకు ఒక పకడ్బంది వ్యూహాన్ని రచించాలని సీఎంలతో ఆయన తెలిపారు. ఇందుకు అవసరమైన సూచనలు ఉంటే తెలియచేయాలన్నారు. కరోనా వైరస్ వ్యాప్తిని కట్టడి చేసేందుకు రానున్న రోజుల్లో మరింత దృష్టి పెట్టాలని సూచించారు. నిర్ధారణ పరీక్షల టెస్ట్, అనుమానితుల గుర్తింపు, ఐసోలేట్ చేయడం, క్వారంటైన్ చేయడం..ఇతరత్రా అంశాల వారిపై నిశితంగా గమనించాలన్నారు.

 

ప్రాణనష్టాన్ని అత్యంత కనిష్టస్థాయికి చేర్చడమే లక్ష్యంగా ముందుకు సాగాలన్నారు. ఏప్రిల్ 14వ తేదీన కాలం ముగిసిన తర్వాత సాధారణ స్థితికి వచ్చేందుకు ప్రయత్నించాలన్నారు. లాక్ డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా దేశంలో ప్రజలు తగు చర్యలు పాటించాలన్నారు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: