ఇప్పుడు ప్రపంచ దేశాలను గడగడలాడిస్తున్న కరోనా వైరస్ ప్రకృతి సృష్టి కాదని... చైనా దేశీయులే కావాలని కరోనా వైరస్ కి కాస్త శక్తిని జోడించి బాగా అభివృద్ధి చెందిన ఇటలీ అమెరికా దేశాలపై వదిలారని ఎన్నో వాదనలు వినిపిస్తున్నాయి. చైనీయులు ముందుగానే తమ ఆర్మీ జవాన్లకు, రాజకీయ నేతలకు, ప్రముఖులకు కరోనా విరుగుడు మందును ఇచ్చారనే వాదనలు కూడా గట్టిగానే వినిపిస్తున్నాయి. తమ దేశంలో కరోనా వ్యాప్తి చేసి తమ ప్రజలు కూడా కరోనా వైరస్ దెబ్బకి ఆహుతి అవుతున్నారని, కరోనా ముమ్మాటికీ ప్రకృతి సృష్టేనని చైనా ఉద్దేశపూర్వకంగా ప్రపంచ దేశాలన్నింటికీ తెలిసేలా చేసింది. వాస్తవానికి చైనాలో జరుగుతున్న 99% కార్యకలాపాలు బయటికి రావు. కానీ చైనా దేశం మాత్రం కరోనా వైరస్ గురించి అందరికీ తెలిసేలా వీడియోలతో పాటు మిగతా సమాచారం మొత్తం తెలియపరిచింది. అనంతరం తాము ముందుగా తయారు చేసుకున్న వ్యాక్సిన్ ని కరోనా పీడితులకు వేసి నయం చేసింది. ఫలితంగా ఇప్పుడు ఆ దేశం మొత్తం కరోనా ఫ్రీ గా ఏర్పడి రోజువారీ పనులను హాయిగా చేసుకుంటుంది. కేవలం పది రోజుల్లోనే పది అంతస్తుల హాస్పిటల్ కట్టించడం కూడా ప్రీ ప్లాన్ లోని ఓ భాగమేనని తెలుస్తోంది. ఎంతో టెక్నాలజీ ఉన్న ఇటలీ, అమెరికా దేశాలే పది రోజుల్లో పది అంతస్తుల హాస్పటల్ కట్టలేకపోయాయంటే అది చైనాకి మాత్రం ఎలా సాధ్యం అయ్యిందనే అనుమానం రాకపోదు.


ఇకపోతే చైనా కుటిల బుద్ధి వలన 81 మైళ్ల దూరంలో ఉన్న తైవాన్ దేశానికి కూడా తీవ్ర ఇబ్బందులు ఎదురయ్యాయి. రెండు కోట్ల జనాభా ఉన్న ఈ దేశంలో కనీసం వెయ్యి కరోనా కేసులు కూడా నమోదు కాకపోవడం గమనార్హం. వాస్తవానికి తైవాన్ ప్రజలంతా చైనా దేశానికి వెళ్లి వ్యాపార కార్యక్రమాలు చేపడుతుంటారు. చైనీయులు కూడా తైవాన్ దేశానికి పెద్ద సంఖ్యలో తరలి వస్తుంటారు. మరి ఆ దేశంలో కరోనా విపరీతంగా పెరిగి పోకుండా ఉంటుందా? అంటే లేదు! ఖచ్చితంగా పెరుగుతుందని ఎవరైనా అనుకుంటారు. కానీ అలా జరగలేదు. దానికి కారణం తైవాన్ ప్రభుత్వం తీసుకున్న తెలివైన నిర్ణయాలనే చెప్పుకోవచ్చు.


తైవాన్ దేశీయులకు ఆరోగ్యం పట్ల చాలా శ్రద్ధ ఉంటుంది. అక్కడ చాలా తక్కువ ప్రీమియంతో ప్రతి ఒక్కరికి హెల్త్ ఇన్సూరెన్స్ ఉందంటే అతిశయోక్తి కాదు. పబ్లిక్ హెల్త్ ఫెసిలిటీస్ అనగా ప్రభుత్వ ఆసుపత్రులు కూడా ఆ దేశంలో చాలా ఎక్కువగా ఉంటాయి. అక్కడి ప్రజలకు ఏ చిన్న ఆరోగ్య సమస్య వచ్చినా ప్రభుత్వ వైద్యులు వెంటనే ఉచితంగా వైద్యం చేస్తూ ఉంటారు. అందుకే అక్కడి ప్రజలకు ఎక్కువగా అనారోగ్య సమస్యలు తలెత్తవు. ఇంకో విషయం ఏమిటంటే... పాఠశాలలో శుభ్రత పరిశుభ్రత గురించి ప్రత్యేకంగా అవగాహన కల్పిస్తారు ఆ దేశ ఉపాధ్యాయులు. అందుకే అక్కడ పరిసరాలు చాలా పరిశుభ్రంగా ఉంటాయి. అలాగే తైవాన్ సర్కార్ ఇతర దేశస్థులు తమ దేశంలోకి అనుమతించే ముందు స్క్రీనింగ్ టెస్టులు నిర్వహిస్తోంది.


2019 నవంబర్ నెలలో చైనాలో కరోనా వైరస్ విజృంభించిందన్న విషయం తైవాన్ కి తెలిసింది. వెంటనే అప్రమత్తమైన తైవాన్... వుహాన్ నగరం నుండి వచ్చే ప్రతి ఒక్కరికి స్క్రీనింగ్ టెస్ట్ నిర్వహించింది. కరోనా సోకిన వారిని వెంటనే ఐసోలేషన్ వార్డ్ కి తరలించింది. డిసెంబర్ 31వ తేదీన ప్రపంచ ఆరోగ్య సంస్థ తొలిసారిగా కరోనా వైరస్ పై స్పందించగా... తైవాన్ దేశం మాత్రం డిసెంబర్ 20వ తేదీ నాటికే చైనా నుండి తమ దేశానికి వచ్చే వారిలో 26 కొత్త వైరస్లను కనుగొన్నది. వైరస్ బారిన పడిన వారందరిని ఇంట్లోనే ఉండమని లేకపోతే భారీ జరిమానా విధిస్తామని హెచ్చరించింది. మిగతావారంతా యధావిధిగా తమ పనులను చేసుకోవచ్చని చెబుతూ ఎటువంటి లాక్ డౌన్ ప్రకటించలేదు. భారీ జరిమానా విధిస్తారనే భయంతో కరోనా పీడితులు ఇల్లు దాటి బయటకు రాకపోగా... కరోనా వ్యాప్తి పెరగలేదు.


చైనా దేశంలో ఏం జరుగుతుందోనని తెలుసుకోవాలనే ఉద్దేశంతో తమ దేశం నుండి కొన్ని బృందాలను పంపించగా... చైనీయులు మాత్రం తైవాన్ బృందాలను అనుమతించలేదు. దాంతో అనుమానం వచ్చిన తైవాన్ వెంటనే వుహాన్ నగరానికి విమానాల రాకపోకలను నిలిపి వేసింది. చైనా నుండి ఫేస్ మాస్క్ లను కూడా తీసుకునేందుకు నిరాకరించింది తైవాన్ ప్రభుత్వం. ఆ తర్వాత తానే స్వయంగా తమ దేశంలోని స్కూల్ పిల్లలకు 65 లక్షల మాస్క్లను పంపిణీ చేయడంతో పాటు 85వేల హ్యాండ్ శానిటైజెర్లను ప్రతి ఇంటికి పంపించింది. మరోవైపు కరోనా బారిన పడి తీవ్ర ఇబ్బందులు పడుతున్న ప్రతి ఒక్కరిని ఐసొలేషన్ వార్డ్ కి తరలించి ప్రాణాలను కాపాడింది. చైనా జపాన్ లాంటి దేశాలలో వేల సంఖ్యలో కేసులు నమోదు కాగా... తైవాన్ దేశంలో మాత్రం కేవలం 216 కేసులు 2 మరణాలు మాత్రమే సంభవించాయి. ఈ చిన్న దేశం అత్యంత ప్రమాదకరమైన కరోనా వైరస్ ని చాలా చక్కగా సమర్థవంతంగా ఎదుర్కోవటం ఇతర దేశాలకు ఆదర్శమని చెప్పుకోవచ్చు.

మరింత సమాచారం తెలుసుకోండి: