ప్రపంచాన్ని వణికిస్తున్న కరోనాను చూసి అందరు భయపడుతుంటే, వీరు మాత్రం మేము ఉన్నాం అంటూ ప్రజలకు సేవలు చేస్తున్నారు. వాళ్ళు ఎవరో కాదు మన డాక్టర్లు. వాళ్ళ ప్రాణాలు పణంగా పెట్టి మరీ కరోనా బాధితులకు చికిత్సను అందిస్తున్నారు. కేవలం డాక్టర్లు మాత్రమే కాదు, ఇతర వైద్య సిబ్బంది, సహాయ సిబ్బంది కూడా చాలా కష్టపడుతున్నారు. కరోనా బాధితులకు దగ్గరగా ఉండాలంటే వారు తప్పనిసరిగా బయో సూట్లను ధరించాల్సి ఉంటుంది. ఈ బయో సూట్లు ఇతరుల నుండి వైరస్ వ్యాపించకుండా చేస్తాయి. కానీ ప్రస్తుతం కరోనా బాధితులకు చికిత్స అందించే వైద్యులకు, ఇతర సేవలు అందించే సహాయ సిబ్బందికి బయో సూట్ల కొరత చాలా ఇబ్బందిగా మారింది. ప్రాణాలకు తెగించి కరోనా బాధితులకు సేవలు అందిస్తున్న వారి ఇబ్బందులను దూరం చేసేందుకు దేశ రక్షణ పరిశోధణ సంస్థ డీఆర్ డీవో ముందుకు వచ్చింది.

 

 

కరోనా వైరస్‌ బారిన పడకుండా ఉండేందుకు డీఆర్‌డీవో ఒక వినూత్న బయోసూట్‌ను రూపొందించింది. పర్సనల్‌ ప్రొటెక్టివ్‌ ఎక్విప్‌మెంట్‌ (పీపీఈ) సూట్‌ను వివిధ డీఆర్‌డీవో లేబొరేటరీలకు చెందిన శాస్త్రవేత్తలు రూపొందించారు. టెక్స్‌టైల్, కోటింగ్, నానోటెక్నాలజీని ఉపయోగించి ఈ సూట్‌ తయారుచేశారు. ఈ సూట్‌లను ఎక్కువ మొత్తంలో ఉత్పత్తి చేసి, వైద్యులు, ఇతర సిబ్బందిని కరోనా నుంచి కాపాడేందుకు ఎంతగానో శ్రమిస్తున్నట్టు డీఆర్‌డీవో ఓ ప్రకటనలో తెలిపింది. కుసుంఘర్‌ ఇండస్ట్రీస్‌ అనే సంస్థ ఈ సూట్‌ తయారీకి సంబంధించిన ముడి సరుకు సహా, కోటింగ్‌ మెటీరియల్‌ ఉత్పత్తి చేస్తుంది. అలాగే పూర్తి సూట్‌ను కూడా తామే తయారు చేస్తున్నట్టు ప్రకటించింది. ప్రస్తుతం రోజుకు 7 వేల సూట్లను తయారుచేసే సామర్థ్యం తమకు ఉందని వెల్లడించింది. బయో సూట్ల వల్ల చాలా వరకు డాక్టర్లను, ఇతర సహాయ సిబ్బందిని ఈ వైరస్ బారిన పడకుండా కాపాడవచ్చని వారు వివరించారు.

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: