ప్రధానమంత్రి నరేంద్రమోడిని ప్రశ్నించాలంటే చంద్రబాబునాయుడు ఎంతలా వణికిపోతున్నారో స్పష్టంగా తెలిసిపోతోంది. నిజానికి దేశంలో  కరోనా వైరస్ సమస్య పెరిగిపోవటానికి కేంద్రప్రభుత్వం చూపించిన నిర్లక్ష్యమే కారణమని అందరికీ తెలుసు. చైనాలో డిసెంబర్ 30వ తేదీన మొదటి కరోనా వైరస్ కేసు బయటపడింది. దేశంలో మొట్టమొదటి కేసు జనవరి 30న  కేరళలో బయటపడింది. ఈ మధ్యలో కేంద్రప్రభుత్వం ఎటువంటి ముందు జాగ్రత్తలు తీసుకోలేదన్న విషయం స్పష్టం.

 

అలాగే కేరళలో బయటపడిన తర్వాత అయినా జాగ్రత్తలు తీసుకుందా అంటే అదీలేదు. జనవరి, ఫిబ్రవరి నెలల్లో విదేశాల నుండి వచ్చే వాళ్ళకు స్క్రీనింగ్ టెస్టులు చేయాలని ప్రకటించిందే కానీ పెద్దగా పట్టించుకోలేదు. చైనాతో పాటు ఇటలీ, ఫ్రాన్స్, ఇరాన్ లాంటి దేశాల్లో వైరస్ రోగులు పెరిగిపోతున్న కారణంగా ఫ్రిబ్రవరి మూడో వారం నుండి మాత్రమే స్క్రీనింగ్ ను అమలు చేమటం మొదలుపెట్టింది. అంటే అప్పటికే చైనా, ఇటలీతో పాటు వివిధ దేశాల నుండి మనదేశంలొకి వచ్చిన వారు యధేచ్చగా తిరిగేశారు.

 

కేంద్రప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే దేశంలో కేసులు పెరిగిపోయాయి. సరే  ఈ విషయాలన్నింటినీ పక్కన పట్టేసినా మొన్నటికి మొన్న ఢిల్లీలోని మర్కజ్ మసీదులో ప్రార్ధనల కోసమని విదేశాల నుండి వచ్చిన వాళ్ళకి విమానాశ్రయాల్లో కనీసం స్క్రీనింగ్ కూడా చేయలేదు. ఒకవేళ చేసుంటే అప్పుడు విదేశీయులకు వైరస్ సోకిన విషయం బయటపేదే. ఎందుకంటే మత ప్రార్ధనల్లో పాల్గొన్న విదేశీయుల్లో చాలామందికి వైరస్ ఉందన్న విషయం ఇపుడు బయటపడింది.

 

ముందుగా కేంద్రం మేల్కొనని కారణంగానే ఇపుడు యావత్ దేశ ప్రజలు నానా రకాలుగా ఇబ్బందులు పడుతున్నారు. చంద్రబాబునాయుడుకు కేంద్రప్రభుత్వ వైఫల్యాలేవీ కనబడటం లేదా ? వైఫల్యాలపై మోడిని నిలదీయటానికి చంద్రబాబు, చినబాబుతో పాటు టిడిపి నేతలు ఎందుకు వణికిపోతున్నారు ? ప్రతిచిన్న విషయాన్ని భూతద్దంలో చూస్తు జగన్మోహన్ రెడ్డిపై ఆరోపణలు చేయటంలో మాత్రం రెచ్చిపోతున్నారు ప్రతిరోజు.

 

 

 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: