అగ్ర‌రాజ్యం అమెరికా దారుణ స్థితికి చేరిపోయింది. కరోనా ప్రపంచాన్ని వణికిస్తుండ‌టం కరోనా వల్ల ప్రపంచవ్యాప్తంగా 48 వేల మందికి పైగా మృతి చెందిన త‌రుణంలో..అమెరికాలో మరణాల సంఖ్య రోజురోజుకు పెరుగుతోంది. అమెరికాలో వారం క్రితమే కరోనా పాజిటివ్ కేసులు నమోదుకావడం మొదలయింది. వారంలోనే అమెరికా పరిస్థితి తలకిందులయింది. అమెరికాలో కొద్ది రోజుల్లో దారుణ ప‌రిస్థితి రాబోయే అవ‌కాశం ఉంద‌ని ఆ దేశ అధ్య‌క్షుడు డోనాల్డ్ ట్రంప్  ఆందోళ‌న వ్య‌క్తం చేయ‌డం ఆ దేశ ప‌రిస్థితికి నిద‌ర్శ‌నం.

 

ఇప్ప‌టికే అమెరికాలో క‌రోన బాధితుల సంఖ్య దాదాపు 2,20,000 చేరువ‌గా ఉండ‌గా... కరోనా మృతుల సంఖ్య 5000 దాటింది. నిన్న ఒక్కరోజే 1000 మందికి పైగా మృతిచెందారు. ఇక ఒక్క‌ న్యూయార్క్‌లోనే కరోనా మరణాలు 2వేలు దాటాయి. ఒక్కరోజే 4 వేలకు పైగా కొత్త కేసులు నమోదయ్యాయి. దాంతో అమెరికాలో దయనీయమైన పరిస్థితులు నెలకొన్నాయి. ఇప్పటివరకు ప్రపంచవ్యాప్తంగా కరోనా బాధితుల సంఖ్య 9 లక్షల 35వేలు దాటింది. ఇక మరణాలు అయితే 50 వేలకు చేరువలో ఉన్నాయి.

 

ప్ర‌స్తుత ప‌రిస్థితుల నేప‌థ్యంలో క‌ష్ట ప‌రిస్థితిని ధైర్యంగా ఎదుర్కోవ‌డానికి ప్ర‌తి ఒక్క‌రూ సిద్ధంగా ఉండాల‌ని ఈ సంద‌ర్భంగా అమెరికా దేశ ప్ర‌జ‌ల‌కు ధైర్యం చెప్పారు ట్రంప్. క‌రోనాకు ఇప్ప‌టికిప్పుడు మందు త‌యార‌య్యేలా క‌నిపించ‌డంలేద‌ని..కాబ‌ట్టి జాగ్ర‌త్త‌లు పాటించ‌డ‌మే ఏకైక మార్గ‌మ‌ని తెలిపారు. క‌రోనా నుంచి త‌ప్పించుకోవాలంటే ఎవ్వ‌రికివారు త‌ప్ప‌నిస‌రిగా జాగ్ర‌త్త‌ తీసుకోవాల్సిందేన‌ని ట్రంప్ చెప్పారు. 

 


ఇవ‌న్నీ ఇలా ఉంటే...కరోనాతో విలవిలలాడుతున్న అమెరికాకు ఇంకో షాక్ త‌గిలింది. అమెరికాలోని ఇదాహో రాష్ట్ర వ్యాప్తంగా ఈ భూకంపం సంభవించిందని…దీని తీవ్రత 6.5 గా ఉందని నేషనల్‌ వెదర్‌ సర్వీస్‌ ప్రకటించింది.  అమెరికా కాల‌మానం ప్ర‌కారం,  మంగళవారం సాయంత్రం 20-30 సెకన్‌ల పాటు భూమి కంపించిందని… బోయిస్‌ ఈశాన్యంగా ఈ భూకంప కేంద్రం ఉందని అధికారులు తెలిపారు. భూమి కంపించడంతో భయంతో ప్రజలు వీధుల్లోకి పరుగులు తీశారు. కొంతమంది ఇంట్లో వస్తువులు కదులుతుండగా వీడియోలను తీసి సోషల్ మీడియాలో పోస్టు చేశారు.

మరింత సమాచారం తెలుసుకోండి: