ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో క‌రోనా గ‌త మూడు రోజులుగా విజృంభిస్తోంది. బుధ‌, గురు, శుక్ర‌వారాల్లో క‌రోనా కేసులు విప‌రీతంగా పెరిగిపోయాయి. శుక్ర‌వారం ఉద‌యం 11 గంట‌ల‌కు ఒక్క‌సారిగా 12 కొత్త కేసులు న‌మోదు అయిన‌ట్టు లెక్క‌లు వ‌చ్చాయి. దీంతో క‌రోనా కేసుల సంఖ్య మ‌ల్లీ తెలంగాణ‌ను క్రాస్ చేసి ఏకంగా 161కు చేరుకుంది. అత్య‌ధికంగా నెల్లూరు జిల్లాలో 32 కేసులు న‌మోదు అయ్యాయి. ఈ క్ర‌మంలోనే ఆంధప్రదేశ్‌లో తొలి కరోనా మరణం నమోదైంది. ఇదే విషయాన్ని కేంద్ర వైద్య, ఆరోగ్య, కుటుంబ సంక్షేమశాఖ తన వెబ్‌సైట్‌లో పేర్కొంది. ఏపీ రాజ‌ధాని ప్రాంత‌మైన విజ‌య‌వాడ‌లోని భ‌వానీపురం ఏరియాలో ఒకే కుటుంబంలో ఐదుగురికి పాజిటివ్ న‌మోదు అయ్యింది. 

 

ఈ కుటుంబంలోనే ఏకంగా ఐదుగురికి పాజిటివ్ రావ‌డం పెద్ద క‌ల‌క‌లం రేప‌గా ఇప్పుడు తొలి కరోనా మరణం కూడా అక్కడే సంభవించింది. విజయవాడకు చెందిన ఓ వ్యక్తి ఢిల్లీ జమాతే సభకు వెళ్లి రాగా.. ఆ వ్యక్తి తండ్రి కరోనాతో చనిపోయాడు. మరణానంతరం పరీక్షలు చేయించగా కరోనా పాజిటివ్‌ అని తేలింది. అనంత‌రం ఆ కుటుంబంలోని మిగిలిన వారికి కూడా క‌రోనా సోకింది. ఇక ఏపీలో గురువారం ఒక్క రోజే ఏకంగా 38 కేసులు న‌మోదు కాగా.. శుక్ర‌వారం ఉద‌యం ఇప్ప‌టికే 12 కొత్త కేసులు నమోదయ్యాయి. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: