నారావారి వారసుడు నారా లోకేష్ బాబు చేసిన ట్వీట్ ను చదివిన వారికి ఇదే అనుమానం వస్తుంది. శ్రీరామనవమి సందర్భంగా తండ్రి, కొడుకులు పోటిలుపడి ప్రజలకు శుభాకాంక్షలు చెప్పారు. చినబాబు ఎప్పటి లాగే తన పైత్యాన్ని కూడా కాస్త రంగరించాడు లేండి. అదేమిటంటే శ్రీరాముడంటే ఆదర్శమని చెప్పడం వరకూ ఓకే. కానీ అదే సమయంలో ప్రజాస్వామ్య దేశంలో కూడా ప్రజాభిప్రాయానికి విలువ ఇవ్వకుండా నియంతల్లా ఏకపక్ష నిర్ణయాలు తీసుకుంటున్న పాలకులను  చూస్తున్నాం అని అన్నాడు.

 

అంటే ఈ మాట ఎవరిని ఉద్దేశించి అన్నాడో ప్రత్యేకంచి చెప్పాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడో విషయాన్ని చినబాబు మరచిపోయాడు. 2014-19 మధ్య ఏపిని పరిపాలించిన తన తండ్రి చంద్రబాబునాయుడు మాత్రం ప్రజస్వామ్యబద్దంగానే రాష్ట్రాన్ని పాలించాడా ? చంద్రబాబు తీసుకున్న ప్రతి నిర్ణయమూ నియంత నిర్ణయాలనే తలపించింది. రాజధానిగా అమరావతిని ఎవరిని అడిగి ఎంపిక చేశాడు ? తనకు కావాల్సిన ఓ నలుగురితో మాట్లాడుకుని ప్రెస్ మీట్ పెట్టి ప్రకటించేశాడు.

 

ముందు నిర్ణయం తీసేసుకుని తర్వాత అసెంబ్లీలో అదే విషయాన్ని ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే. రాజధాని నిర్ణయాన్ని ప్రకటించేముందు కనీసం అఖిలపక్ష సమావేశం కూడా నిర్వహించలేదు. సరే తర్వాత ఏపికి ఇవ్వాల్సిన ప్రత్యేకహోదా బదులు ప్రత్యేక ప్యాకేజి ఇస్తానని కేంద్రం ప్రకటించినపుడు అఖిలపక్షం కాదు కదా కనీసం ప్రధాన ప్రతిపక్షమైన వైసిపితో కూడా మాట్లాడకుండానే ఓకే చెప్పాశాడే.

సరే ఆ విషయాలను పక్కన పెట్టేస్తే ప్రత్యేకహోదా కోసం పోరాటం చేసిన వారిపై కేసులు పెట్టించిన విషయం చినబాబు మరచిపోయినట్లున్నాడు. హక్కుల కోసం పోరాటం చేస్తేనే కేసులు పెట్టించింది ఎవరు ?  రాజధాని కోసం భూములు ఇచ్చేది లేదని చెప్పిన రైతుల పొలాలు తగలబెట్టించిందెవరు ? ప్రభుత్వ నిర్ణయాలను ప్రశ్నిస్తున్నందుకు వైసిపి ఎంఎల్ఏలు, నేతల్లో ఎంతమందిని అరెస్టులు చేయించి రిమాండ్ కు పంపటం రామరాజ్యమేనా ? సింగపూర్ కంపెనీలతో ఒప్పందాలను ఏకపక్షంగా కుదుర్చుకున్నదెవరో చినబాబుకు గుర్తు లేదా ?  కాబట్టి ట్వీట్లు పెట్టేటపుడు ఒకసారి చెక్ చేయమని పెడుతున్న వాళ్ళకి చెబితే బాగుంటుందేమో ?

 

మరింత సమాచారం తెలుసుకోండి: