కరోనా వైరస్ వ్యాప్తి నేపథ్యంలో భారతదేశంలో లాక్ డౌన్ ప్రకటించిన సంగతి తెలిసిందే. ఈ ఆకస్మిక నిర్ణయం కారణంగా పేదవాళ్లుకు, వలస కూలీలకు సమస్యలు ఎదురవుతున్నప్పటికీ... కరోనా వైరస్ వ్యాప్తి మాత్రం అదుపులో ఉంది. మరోవైపు రైతులు తాము పండించిన పంటలను రవాణా చేయలేక తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారు. చాలామంది ఇప్పటికే పచ్చిమిరపకాయలను, టమాటాలను, పైన్ యాపిల్స్ లను, కాలీఫ్లవర్లను, ద్రాక్ష పండ్లను అమ్మటం కుదరక పొలంలోనే విడిచిపెట్టారు. కొంతమంది మాత్రం తాము సాదుతున్న గేదెలకు తాము పండించిన కూరగాయలను, పండ్లను ఆహారంగా ఇస్తున్నారు.


ఎలాగో బయట ఏ వాహనాలని అనుమతించడం లేదు కాబట్టి... లాక్ డౌన్ ఎత్తేసే సమయానికి తమ పండించిన పండ్లు కూడా పాడైపోతాయి కాబట్టి... వాటిని పారేయలేక ఆహారంగా పెడుతున్నారు కొంతమంది రైతులు. స్ట్రాబెర్రీస్ పంట పండించిన రైతులు ఇంకా ఎక్కువ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఎందుకంటే ఫాదర్ ఈస్ ఎక్కువగా విదేశీయులు, టూరిస్టులు, ఐస్ క్రీమ్ వ్యాపారులు కొనుగోలు చేస్తుంటారు. కానీ మూడు వారాల పాటు లాక్ డౌన్ ప్రకటించడం కారణంగా టూరిస్ట్లు మన దేశానికి వచ్చే పరిస్థితి లేదు, ఐస్ క్రీమ్ వ్యాపారాలు కూడా మూలనపడ్డాయి.


అయితే ముంబై కి 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న సతారా డిస్ట్రిక్ట్ కి చెందిన ఒక రైతు అనిల్ సాలుంకే మాట్లాడుతూ... తాను రూ. 2 లక్షల 50 వేల పెట్టుబడితో తన రెండు ఎకరాలలో స్ట్రాబెర్రీస్ పంట పండించానని... ఎనిమిది లక్షల రూపాయలకు తన పంట అమ్ముకోవాలని ఆశించానని కానీ పెద్ద నగరాలకు తాను పండించిన స్ట్రాబెర్రీస్ తీసుకెళ్లేందుకు కుదరలేదని... పెట్టుబడి కూడా వచ్చే అవకాశం లేదని తాను ఆవేదన వ్యక్తం చేస్తూ చెప్పాడు. ఇక చేసేదేమీలేక తాను సాదుకునే గేదెలకు మూడు పూటలా స్ట్రాబెర్రీస్ పెడుతున్నాడు.


బెంగళూరుకు చెందిన మునిశామప్ప అనే ఓ రైతు ఏకంగా 15 టన్నుల ద్రాక్ష పండ్లను దగ్గరలోని ఓ అడవిలో పార పోశాడు. అమ్మటం వీలు కాలేదని... ఉచితంగా ఇస్తానన్నా లాక్ డౌన్ కారణంగా ప్రజలు కూడా తమ వద్దకు రాలేకపోయారని... తన పంట మొత్తం వృథా అయిపోయిందని... పెట్టుబడిగా పెట్టిన ఐదు లక్షల రూపాయల నష్టం వచ్చిందని తాను కంట తడి పెట్టుకున్నాడు. విదేశాలకు ఎగుమతి చేసే ఎన్నో పండ్లు కూరగాయలను పండించిన రైతులంతా ఇప్పుడు తీవ్రంగా నష్టపోయారు. ఏది ఏమైనా ఇది చాలా బాధాకరమైన విషయం. 

మరింత సమాచారం తెలుసుకోండి: