క‌రోనా దెబ్బ‌తో మ‌హా మ‌హా దేశాలే విల‌విల్లాడుతున్నాయి. ప్ర‌పంచ కోవిడ్ బాధితుల సంఖ్య 10 ల‌క్ష‌లు దాటేసింది. కోవిడ్ మ‌ర‌ణాలు కూడా 53 వేల‌కు చేరుకున్నాయి. ఈ క్ర‌మంలోనే చైనా లోని వుహాన్ న‌గ‌రంలో ఉన్న జంతువులు.. జంతు మార్కెట్ ద్వారానే క‌రోనా వ్యాప్తి చెందింది అన్న సందేహాలే ఇప్ప‌టి వ‌ర‌కు ఎక్కువుగా ఉన్నాయి. ఇక ఇట‌లీలో కూడా ఓ వ్యక్తికి పిల్లి నుంచి క‌రోనా సోకింద‌ని కొంద‌రు అంటుంటే.. మ‌రి కొంద‌రు మ‌నిషి నుంచి పిల్లికే క‌రోనా సోకింద‌ని అంటున్నారు. 

 

దీంతో జంతువుల నుంచి కూడా క‌రోనా వ‌చ్చేస్తుంద‌న్న సందేహాలు ఇప్పుడు అంద‌రి మ‌దిలో ఉన్నాయి. దీనిపై తెలుగు సినీ నటి, జంతు సంరక్షణ కార్యకర్త అమల అక్కినేని కరోనా వైరస్‌ వ్యాప్తిపై స్పందించారు. పెంపుడు జంతువులకు కరోనా వస్తుందన్న వదంతులను నమ్మొద్దు అని ఆమె స్పష్టం చేశారు. పెంపుడు జంతువుల నుంచి మ‌నుష్యుల‌కు వైర‌స్ వ్యాప్తి చెంద‌న‌ని ఆమె తెలిపారు. ఇందుకు త‌గిన ఆధారాలు కూడా లేవ‌న్నారు. 

 

ఇక తెలంగాణ వ్యాప్తంగా కరోనా పాజిటివ్‌ కేసుల సంఖ్య 154కు చేరుకుంది. నిన్న ఒక్కరోజే కొత్తగా 27 కేసులు నమోదు అయ్యాయి. 9 మంది ప్రాణాలు కోల్పోయారు. ఈ వైరస్‌ నుంచి 17 మంది కోలుకుని డిశ్చార్జి అయ్యారు. ఏపీలో క‌రోనా కేసులు 161కు చేరుకున్నాయి. నెల్లూరు 32, కృష్ణా 23 కేసుల‌తో టాప్ టు ప్లేసుల్లో ఉన్నాయి. ఇక మూడో స్థానంలో ఉన్న ప్ర‌కాశం జిల్లాలో 17 కేసులు న‌మోదు అయ్యాయి. ఇక ఏపీలో తొలి క‌రోనా మ‌ర‌ణం కూడా సంభ‌వించింది. విజ‌య‌వాడ‌లోని భ‌వానీపురానికి చెందిన ఓ వ్య‌క్తి క‌రోనా సోకి మృతి చెందారు. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :


NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 
Google: https://tinyurl.com/NIHWNgoogle

 
apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: