కరోనా దెబ్బకి ప్రస్తుతం ప్రపంచం మొత్తం అతలాకుతలం అవుతుంది. రోజు రోజుకి పెరుగుతున్నా పాజిటివ్ కేసులతో ప్రజలు భయాందోళనతో బతికేస్తున్నారు. ఇది ఇలా ఉండగా ప్రతి దేశం యొక్క ఆర్థిక పరిస్థితులు ఎంత దిగజారాయో ఆ దేశ ప్రభుత్వానికే అంతు చిక్కడం లేదు. నిజానికి ఈ దెబ్బ అంత ఆయా దేశాల దేశీయ మార్కెట్ల మీద తీవ్ర ప్రభావం పడింది. నిజానికి ఈ దేశం అంటూ నష్టపోలేదు అనకుండా ప్రతి దేశం ఆ పరిస్థితిని ఎదురుకుంది. కరోనా కారణంతో ముఖ్యంగా విరివిధా దేశాలలో లాక్ డౌన్ కారణంతో అనేక రంగాలలో ఉత్పత్తులు కుంటుపడ్డాయి. దీనితో ఈ ప్రభావం మొత్తం ఆయా దేశ మర్కెట్స్ పై కనిపించింది.

 


ఇక అసలు విషయానికి వస్తే... ఈరోజు భారత దేశీయ స్టాక్ మార్కెట్లు ఓపెనింగ్ లో కాస్త లాభపడినా వెంటనే నష్టాల్లోకి వెళ్లాయి. ప్రస్తుతానికి సెన్సెక్స్ 363 పాయింట్లు క్షీణించి 27901 వద్ద, నిఫ్టీ 104 పాయింట్లు నష్టంతో 8149 వద్ద కదులాడుతున్నాయి. దీనితో సెన్సెక్స్ 28వేల స్ఠాయిని, నిఫ్టీ 8150 స్థాయి దిగువకు వెళ్లాయి. ఈరోజు దీనితో దాదాపు అన్ని రంగాల షేర్లు కూడా నష్టాల్లో ట్రేడ్ అవుతున్నాయి. బ్యాంకింగ్, ఆటో, రియల్ ఎస్టేట్ షేర్లు ఇలా ప్రతి ఒక్కటి నష్టాలలో సాగుతున్నాయి. 

 


ఇక సిప్లా, ఓఎన్జీసీ, పవర్ గ్రిడ్, సన్ ఫార్మా, గెయిల్,ఐటీసీ జీ ఎంటర్ టైన్ మెంట్ లాభాల బాటలో నడుస్తున్నాయి. ఇంకా కోటక్ మహీంద్ర, ఇండస్ ఇండ్, హీరో మోటో, టైటన్, ఆసియన్ పెయింట్స్, బీపీసీఎల్,ఐసీఐసీఐ బ్యాంకు టాప్ లూజర్స్ గా ప్రస్తుతం కొనసాగుతున్నాయి. ఇక మార్చి నెలలో అమ్మకాలు పూర్తిగా నెల చూపులు చూడడంతో బజాజ్ ఆటో, టాటా మోటార్స్ అశోక్ లేలాండ్, మారుతి లాంటి షేర్లలో అమ్మకాలు జోరందుకున్నాయి. ఇంకోవైపు డాలరు మారకంలో రూపాయి మరింత నష్ట పోయింది . ప్రారంభంలోనే 48 పైసలు వద్ద నష్ట పోయి 76.08 వద్ద ట్రేడ్ అవుతుంది. 

మరింత సమాచారం తెలుసుకోండి: