ఏపీలో కరోనా బాధితుల సంఖ్య అంతకంతకూ పెరుగుతోంది. గత మూడు రోజుల నుంచి రాష్ట్రంలో కొత్త కేసులు భారీ సంఖ్యలో నమోదవుతున్నాయి. రాష్ట్రంలో కరోనా బాధితుల సంఖ్య 161కు చేరింది. నెల్లూరు జిల్లాలో అత్యధికంగా 32 కేసులు నమోదయ్యాయి. ఈరోజు 12 కేసులు నమోదు కాగా నెల్లూరు జిల్లాలోనే 8 కేసులు నమోదు కావడం గమనార్హం. రాష్ట్రంలోని నెల్లూరు, గుంటూరు, కృష్ణా జిల్లాలలో కరోనా వేగంగా విజృంభిస్తోంది. 
 
ఏపీలో 4 జిల్లాలలో మాత్రం కరోనా ప్రభావం పెద్దగా లేదు. రాష్ట్రంలోని శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో ఇప్పటివరకూ వరకూ ఒక్క కరోనా పాజిటివ్ కేసు కూడా నమోదు కాలేదు. అందువల్ల ఈ రెండు జిల్లాల ప్రజలు సేఫ్ జోన్ లో ఉన్నారు. రాయలసీమలోని కర్నూలు, అనంతపురం జిల్లాలలో కరోనా ప్రభావం పెద్దగా లేదనే చెప్పాలి. కర్నూలు జిల్లాలో ఒక పాజిటివ్ కేసు నమోదు కాగా అనంతపురం జిల్లాలో రెండు పాజిటివ్ కేసులు నమోదయ్యాయి. 
 
ఈ రెండు జిల్లాలలో భారీ సంఖ్యలో ముస్లింలు మర్కజ్ ప్రార్థనలకు హాజరైనప్పటికీ కొత్త కేసులు నమోదు కావడం లేదు. కర్నూలు జిల్లాలోని సంజామల మండలం నొస్సం గ్రామంలో రాజస్తాన్ కు చెందిన వ్యక్తికి కరోనా పాజిటివ్ నిర్ధారణ అయింది. ఈ వ్యక్తి ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నాడు. అనంతపురం జిల్లాలో రెండు రోజుల క్రితం రెండు పాజిటివ్ కేసులు నమోదైనట్లు రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ ప్రకటన చేసింది. 
 
మిగతా జిల్లాలతో పోలిస్తే ఈ నాలుగు జిల్లాల ప్రజలు సేఫ్ జోన్ లో ఉన్నారనే చెప్పాలి. రాష్ట్రంలో రోజురోజుకు కేసులు పెరుగుతూ ఉండటంతో ప్రభుత్వం లాక్ డౌన్ నిబంధనలను మరింత కఠినంగా అమలు చేస్తోంది. రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ పాజిటివ్ కేసులు నమోదైన ప్రాంతాలను కోర్, బఫర్ జోన్లుగా విభజించి సూపర్ మార్కెట్ల ద్వారా సరుకులను ఇంటికే పంపిణీ చేస్తోంది. పలు జిల్లాలలో ప్రజలెవరూ మార్కెట్ కు రావాల్సిన అవసరం లేకుండా ఫోన్ ద్వారా ఆర్డర్ చేస్తే సరుకులు ఇంటికి పంపిణీ చేసే విధంగా చర్యలు చేపట్టింది. 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: