కరోనా వైరస్ ఇండియాలోనూ చాలా స్పీడుగా వ్యాపిస్తోంది. ఇలాంటి సమయంలో మరి జనంలోకి వెళ్లాలంటేనే చాలా భయంగా ఉంటుంది. ఎవరికి కరోనా ఉందో.. ఎవరికి లేదో తెలుసుకోలేం. మరి ఇలాంటి సమయంలో... మీ దగ్గర్లో ఉన్న వ్యక్తికి కరోనా ఉందో లేదో తెలుసుకోవడం ఎలా.

 

 

ఇందుకు ఓ సొల్యూషన్ ఉంది. కరోనా వైరస్ సోకిన వ్యక్తుల్ని గుర్తించడానికీ, కరోనా నుంచి మిమ్మల్ని మీరు కాపాడుకోవడానికీ భారత ప్రభుత్వం ఓ యాప్ ను తయారు చేసింది. ఆరోగ్య సేతు పేరుతో అత్యంత ఉపయోగకరంగా ఈ యాప్ రూపొందించింది.

 

 

కోవిడ్-19 ట్రాకింగ్ యాప్ ను తెలుగుతో పాటు దాదాపుగా 11 భాషల్లో ఈ యాప్ వచ్చింది. లొకేషన్ డేటా మరియు బ్లూటూత్ లకు పర్మిట్లు ఇవ్వడం ద్వారా వైరస్ సోకిన వ్యక్తి మీ సమీపంలోకి వస్తే వెంటనే మీ ఫోన్‌కు అలెర్ట్ వచ్చేస్తుంది. అలాగే కరోనా పేషంట్ కు దగ్గర్లోకి వెళ్ళిన వారి వివరాలను కూడా ఈ యాప్ ఆరోగ్య శాఖకు అందచేసి వైద్య సిబ్బందిని అప్రమత్తం చేస్తుంది.

 

 

దీనితోపాటు కరోనా వైరస్ గురించిన అనేక సూచనలనీ, సమాధానాలనీ, సమాచారాన్నీ , ఆరోగ్య మంత్రిత్వ శాఖ అందించే లేటెస్ట్ సమాచారాన‌ని మీరు ఈ యాప్ ద్వారా తెలుసుకోవచ్చు. ఈ యాప్ ను ఆండ్రాయిడ్, యాపిల్ రెండు సాఫ్ట్ వేర్‌లలోనూ అందుబాటులోకి తెచ్చారు. ఇదేదో చాలా బావుంది కదూ.

 

 

మీరు కూడా వెంటనే ఈ యాప్ డౌన్ లోడ్ చేసుకోండి. అందరికీ పనికొచ్చే ఇలాంటి సమాచారాన్ని మీరు ఎక్కువగా ఫార్వార్డ్ చేయండి. దీని ద్వారా వదంతులకు అడ్డుకట్ట పడుతుంది. సరైన సమాచారం ఎక్కువగా సోషల్ మీడియాలోకి వెళ్తుంది.

 

 

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN
వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

Apple : https://tinyurl.com/NIHWNapple

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: