దేశంలో రోజు రోజుకీ కరోనా వ్యాప్తి చెందుతుంది.. దీన్ని నిర్మూలించేందుకు ప్రభుత్వాలు ఎన్నో రకాలుగా ప్రయాత్నాలు కొనసాగిస్తున్నాయి. అయితే కొంత మంది బయటకు రావొద్దు అని ఎన్ని విధాలుగా చెప్పినా ఎవరూ వినడం లేదు. పిల్లల హగ్గీస్ కోసం, చాక్లెట్స్ కోసం ఇష్టం వచ్చినట్టు రోడ్ల మీదకు వస్తున్నారు జనం. మరికొంత మంది ఆకతాయిలు విచ్చలవిడిగా రోడ్లపై చక్కర్లు కొడుతున్నారు. ఇదేమని పోలీసులు ప్రశ్నిస్తే వారికే తిరగి సమాధానం చెబుతూ.. కొన్ని చోట్ల దాడులకు కూడా యత్నిస్తున్నారు. దాంతో కరోనా కేసులను కట్టడి చేయడానికి లాక్ డౌన్ ప్రకటించినా సరే జనం మాత్రం ఇష్టం వచ్చినట్టు ప్రవర్తించడం తో కరోనా ఎక్కడ పెరుగుతుందో అనే ఆందోళన ప్రభుత్వాల్లో వ్యక్తమవుతుంది.

 

తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో పోలీసులు దండం పెట్టి చెప్పారు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణా రాష్ట్రాల్లో లాఠీ లతో చెప్పారు. కరోనా వైరస్ ను కట్టడి చేసే క్రమంలో దేశ వ్యాప్తంగా విధించిన లాక్ డౌన్ కొనసాగుతోంది. లాక్ డౌన్ ఉల్లంఘిస్తున్న వారిపై పోలీసులు చర్యలు తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో పోలీసుల భద్రతకు సంబంధించి ఉత్తరప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

 

కాగా,  21 రోజుల పాటు యూపీలో లాక్ డౌన్ సందర్భంగా ఎవరైనా పౌరులు పోలీసులపై దాడులకు పాల్పడితే అలాంటి వారిపై జాతీయ భద్రతా చట్టం (ఎన్ఎస్ఏ) కింద కేసులు నమోదు చేయాలని యూపీసర్కారు పోలీసులకు జారీ చేసిన ఆదేశాల్లో కోరింది.  పోలీసులపై దాడి చేసే వారిపై జాతీయ భద్రత చట్టం కింద కేసులను నమోదు చేయాలని ఆదేశించింది.

 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple


 
 

 

 

మరింత సమాచారం తెలుసుకోండి: