ఇపుడు లాక్ డౌన్ పాటిస్తున్నాం. అంతా హాయిగా ఉన్నామనుకుంటున్నాం. నిజమే ఇంట్లో ఉండడం వల్ల కరోనా వైరస్ సోకే అవకాశాలు పెద్దగా లేవు. వచ్చిన కేసులు కూడా ఇపుడు బయటపడుతున్నాయి. సరే వారిని క్వారంటైన్ లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. ఇక ఇంట్లో ఉన్న వారు ఇప్పటికతే సేఫ్. కానీ తరువాత.

 

అంటే లాక్ డౌన్ ఎత్తివేసిన తరువాత సంగతేంటన్నది ఇపుడు మేధావులు, వైద్య నిపుణులు, శాస్త్రవేత్తలలో మెదులుతున్న పదునైన ప్రశ్న. ఎందుకంటే కరోనా వైరస్ అన్నది నివారణ లేనిది. దాని నుంచి మనం ఇంతదాకా లాక్ డౌన్ పేరిట దాక్కున్నాం. ఆ తరువాత మనం బయటకు వస్తాం. అపుడు దేశంలో ఎక్కడున్నా కూడా అది మళ్ళీ వచ్చి కాటేసేందుకు రెడీగా ఉంటుంది.

 

ప్రపంచ ఆరోగ్య సంస్థ చెప్పింది కూడా ఇదే. లాక్ డౌన్ మంచిదే. కానీ అదే  చివరి ప‌రిష్కారం కాదు. లాక్ డౌన్ సమయంలో రోగులను నిర్ధారించి వారికి చికిత్స చేసి ఎవరికీ లేకుండా చేసి అపుడు లాక్ డౌన్ ఎత్తివేస్తే ఫలితం ఉంటుంది. కానీ మన దేశంలో జరుగుతున్నది వేరుగా ఉంది.

 

లాక్ డౌన్ సమయంలో కరోనా నిర్ధారణ పరీక్షలు జరుగుతున్నవి  తక్కువేనని అంతా పెదవి విరుస్తున్నారు. ఇదొక ముప్పుగా ఉంది. దాన్ని మించి ం మరోకటి ఉంది. అదేంటి అంటే లాక్  డౌన్ ఎత్తివేసిన తరువాత అపుడు సడెన్ గా కొత్త కేసులు బయటపడితే వాటి సంగతేంటి.

 

అంతే కాదు, ఇపుడు ఎక్కడివారిని అక్కడ ఉంచి లాక్ డౌన్ అని అమలుచేస్తున్నారు. ఒకవేళ లాక్ డౌన్ ఎత్తివేస్తే వారంతా తిరిగి తమ గ్రామాలకు, సొంత ప్రాంతాలకు వెళ్తారు. దీన్ని రివర్స్ మైగ్రేషన్ అంటారు. అలా రివర్స్ మైగ్రేషన్ ద్వారా మళ్ళీ కరోనా వైరస్ వీర విహారం చేస్తే అపుడు పరిష్తితి ఏంటి.

 

కరోనా వైరస్ కి కేంద్రం ఇంతవరకూ చేసిందల్లా ఒక్కటేనని నిపుణుల మాటగా  ఉంది. అదేంటి అంటే అందరినీ ఇంట్లో కూర్చోబెట్టడం. కానీ విలువైన మూడు వారాల కాలాన్ని కేంద్రంతో పాటు రాష్ట్ర ప్రభుత్వాలు సద్వినియోగం చేసుకున్నాయా అంటే  పూర్తిగా లేదన్న మాట వస్తుంది.

 

పెద్దగా టెస్టులు ఈ దేశంలో జరగలేదు. ఈ దేశంలో ఎక్కడ కరోనా వైరస్ బాధితులు ఉన్నారో  అసలైన ఫిగర్స్ అన్నవి ఇప్పటికీ  అయోమయంగానే ఉంది. మార్చి 30వ తేదీ వరకూ  ఢిల్లీ ప్రార్ధనల్లో పాల్గొన్న వారు ఎవరనేది ఎవరికీ ఎరుక లేకపోయింది. ఇక అసలు ఆ మీటింగు జరిగిన సంగతి కూడా ఎవరికీ జనతా కర్ఫ్యూ, లాక్ డౌన్ సమయానికి కూడా ఏ విధంగా కూడా కీలకమైన  సమాచారం లేకపోయింది. ఇది ముమ్మాటికీ మన ఇంటలిజెన్స్ వైఫల్యమే.  ఈ నేపధ్యంలో ఒక్కసారిగా లాక్ డౌన్ ఎత్తివేశాక అలాంటి ఢిల్లీ ఉదంతాలు బయపడితే అపుడు సంగతేంటన్నది అతి పెద్ద ప్రశ్న.

 

అందుకే దేశంలో లాక్ డౌన్  పేరిట  "భౌతిక దూరాన్ని పాటించడం మంచి నిర్ణయమే అయినా, అదొక్కటే సరిపోదు., ఇక ఇంతవరకూ కరోనా నివారణకు ఓ రోడ్ మ్యాప్ ను కేంద్రం ప్రకటించక పోవడం అసంతృప్తిని కలిగిస్తోంది. ఈ లాక్ డౌన్ ముగిసిన తరువాత మహమ్మారిపై ఎలా పోరాటం చేయాలో ముందే చెప్పాలి" అని కేంద్రానికి తాజాగా  పంపిన ఒక ప్రకటనలో  పలువురు మేధావులు,   శాస్త్రవేత్తలు కోరారు. మరి కేంద్రం సరైన దిశగా చర్యలు తీసుకోవాలి. అపుడే దేశం నుంచి కరోనా వైరస్ పారదోలినట్లు అవుతుంది.

 

మరింత సమాచారం తెలుసుకోండి: