దేశ రాజధాని ఢిల్లీలో జరిగిన నిజాముద్దీన్ మర్కజ్ కార్యక్రమం కారణంగా దేశమంతటా కరోనా ఎలా వ్యాపించిందో చూస్తూనే ఉన్నాం. ఈ కార్యక్రమానికి హాజరైన వేల మందికి కరోనా సోకింది. ఇప్పుడు దేశంలో నమోదవుతున్న కేసుల్లో సగానికి సగం ఈ కార్యక్రమం ద్వారా వ్యాపించినవే అని సమాచారం అందుతోంది. నిజాముద్దీన్‌లో జరిగిన మర్కజ్‌’కు హాజరైన వారిలో కరోనా పాజిటివ్‌ కేసులు ఎక్కువగా ఉన్నాయి.

 

 

విదేశాల నుంచి, దేశం నలుమూలల నుంచి ఈ కార్యక్రమానికి పెద్ద సంఖ్యలో తబ్లిగీకి హాజరయ్యారు. విదేశీయుల నుంచి ఈ వైరస్‌ భారతీయులకు సోకింది. ఈ ఒక్క కార్యక్రమం దేశాన్నే అతలాకుతలం చేస్తోంది. అయితే ఇప్పుడు మరో షాకింగ్ న్యూస్ వెలువడింది. అదేంటో తెలిస్తే షాక్ అవ్వడం ఖాయం. ఎందుకంటే.. దేశంలో ఇలాంటిదే మరో మర్కజ్ కార్యక్రమం జరగబోగా పోలీసులు ముందు జాగ్రత్తతో అడ్డుకున్న విషయం ఇప్పుడు కలకలం సృష్టిస్తోంది.

 

 

 

నిజాముద్దీన్‌ సభ లాంటిదే ముంబయి సమీపంలో వాసైలో మార్చి 14న ఏర్పాటు చేయడానికి తబ్లిగీ జమాత్‌ సంఘం ప్రయత్నించిందన్న వార్త వెలుగులోకి వచ్చింది. అయితే ఈ సమావేశానికి పోలీసు యంత్రాంగం కూడా మొదట అంగీకరించిందట. అయితే మార్చిలో కరోనా వేగంగా వ్యాప్తి చెందడంతో ఆ ప్రాంతానికి చెందిన ఇన్‌స్పెక్టర్‌ జనరల్స్‌ కొంకణ్‌ రాంజే, నికేత్‌ కౌషిక్‌ దీన్ని అడ్డుకున్నారట.

 

 

ఓవైపు కరోనా వ్యాపిస్తోంది కాబట్టి.. ఈ కార్యక్రమానికి విదేశాల నుంచి వేల సంఖ్యలో తబ్లిగీ కార్యకర్తలు వచ్చే అవకాశం ఉండడంతో పోలీసులు అప్పటికే ఇచ్చిన అనుమతిని రద్దు చేశారట. ఇప్పుడు ఢిల్లీలోని నిమాముద్దీన్ మర్కజ్ ఘటన వెలుగుచూడటంతో ముంబై పోలీసులు షాకయ్యారట. ముంబై కార్యక్రమానికి కూడా అనుమతి ఇచ్చి ఉంటే ఇంకెంత ఘోరం జరిగి ఉండేదో అని చర్చించుకుంటున్నారట.

మరింత సమాచారం తెలుసుకోండి: