దేశంలో రోజురోజుకూ విస్త‌రిస్తున్న క‌రోనా వైర‌స్ ను క‌ట్ట‌డి చేసేందుకు కేంద్రం అన్ని చ‌ర్య‌లు తీసుకుంటోంది. ప్ర‌జ‌ల‌ను మ‌రింత అప్ర‌మ‌త్తం చేసేందుకు, వైర‌స్ వ్యాప్తి నివార‌ణ‌కు తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై వారికి అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ప‌లువురు ప్ర‌ముఖ క్రీడాకారులను ప్ర‌ధాని న‌రేంద్ర మోడీ రంగంలోకి దింపుతున్నారు. తాజాగా క్రికెట్ క్రీడాకారులు స‌చిన్ టెండుల్క‌ర్‌,  విరాట్ కోహ్లీతోపాటు భార‌త్ స్టార్ షెట్ల‌ర్ పీవీ సింధూ త‌దిత‌ర క్రీడాకారుల‌తో ప్ర‌ధాని వీడియో కాన్ఫ‌రెన్స్ నిర్వ‌హించారు.

 

 

క‌రోనా వైర‌స్ క‌ట్ట‌డికి తీసుకోవాల్సిన జాగ్ర‌త్త‌ల‌పై ప్ర‌జ‌ల‌కు అవ‌గాహ‌న క‌ల్పించేందుకు ముందుకు రావాల‌ని ఆయ‌న కోరారు. ఈ ఆప‌త్కాల స‌మ‌యంలో అంతా స‌మ‌ష్టిగా ఉండాల‌ని, ప్ర‌జ‌ల్లో మ‌రింత ధైర్యాన్ని పెంచేలా కృషి చేయాల‌ని ఆయ‌న పిలుపునిచ్చారు. మోడీ పిలుపు మేర‌కు క్రీడాకారులంతా సాన‌కూలంగా స్పందిస్తున్నారు.  కాగా భార‌త్ లో ఇప్ప‌టి వ‌ర‌కు 2, 488 పాజిటివ్ కేసులు న‌మోదుకాగా, 79 మంది మృత్యువాత ప‌డ్డారు. 

మరింత సమాచారం తెలుసుకోండి: