దేశంలో ఎక్కడ చూసినా కరోనా కరోనా అని భయపడి ఛస్తున్నారు.  ఈ నేపథ్యంలో మనిషిని మనిషి ముట్టుకోవాలంటే భయవంతో వణికి పోతున్నారు. షేక్ హ్యాండ్స్ దూరం.. నమస్తేనే బెటర్ అంటున్నారు. ఇలాంటి సమయంలో తమ పక్కన ఉన్నవారికి కరోనా పాజిటీవ్ అని తెలిస్తే.. వారితో సన్నిహితంగా ఉంటే పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోండి. తాజాగా ములుగు జిల్లా ఏటూరు నాగారంలో ఇద్దరు కిరాణా షాపు నిర్వాహకులకు పాజిటివ్ రావడంతో, వారి షాపుల్లో సరుకులు కొన్న వందలాది మందిలో తీవ్ర ఆందోళన నెలకొంది.  

 

ఈ ఇద్దరు బాధితులూ మార్చిలో జరిగిన మార్కజ్ ప్రార్థనల్లో పాల్గొని వచ్చిన వారే కావడం గమనార్హం. ఇక మార్చి 18 నుంచి కిరాణా షాప్ లో నిత్యావసరాలు విక్రయించారు. లాక్ డౌన్ ప్రారంభమైన తొలి నాళ్లలో వీరిద్దరి వద్దకూ పెద్దఎత్తున వచ్చిన ప్రజలు నిత్యావసరాలు కొనుగోలు చేయడంతో, వారందరిలోనూ ఆందోళన నెలకొంది. ఇద్దరికీ కరోనా లక్షణాలు కనిపించగా, రక్త నమూనాలు సేకరించిన అధికారులు, ఇద్దరికీ వ్యాధి సోకినట్టు నిర్దారించారు. వారిని హైదరాబాద్, గాంధీ ఆసుపత్రికి తరలించారు.

 

ఆపై నిన్న వారి ఇళ్లకు వెళ్లి 26 మంది కుటుంబీకులను తాడ్వాయిలోని హరిత హోటల్ కాటేజీకి తరలించి క్వారంటైన్ చేశారు. ఇక ఏటూరు నాగారం, వీరి దుకాణాలు ఉన్న గోవిందరావు పేటలో 144 సెక్షన్ ను అమలు చేస్తున్న పోలీసుు, పట్టణానికి వచ్చే అన్ని రహదారులనూ మూసివేశారు. అయితే కుటుంబీకులెవరిలోనూ ప్రాథమిక అంచనాల ప్రకారం, వైరస్ లక్షణాలు లేవని ములుగు కలెక్టర్ ఎస్ కృష్ణ ఆదిత్య వెల్లడించారు. 

 

కరోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

 

మరింత సమాచారం తెలుసుకోండి: