క‌రోనా వైర‌స్ లేదా కోవిడ్‌-19.. ప్ర‌స్తుతం ఈ పేరు విన‌బ‌డితే చాలు.. ప్ర‌జ‌లు ఆమ‌డ‌దూరం కాదు.. అంత‌క‌న్నా ఎక్కువే ప‌రిగెడుతున్నారు. ముఖ్యంగా క‌రోనా ఎఫెక్ట్‌తో అగ్రరాజ్యం అమెరికా చిగురుటాకులా వణికిపోతోంది. యూరప్‌ దేశాలు దిక్కుతోచని స్థితిలో పడిపోయాయి. ప్రధానంగా ఇటలీ, ఫ్రాన్స్, స్పెయిన్‌లలో కరోనా కోరలు చాచింది. ఇక ఇప్ప‌టికే ఈ వైరస్ కారణంగా ప్రపంచవ్యాప్తంగా 51,000 మందికి పైగా మరణించారు, ఇటలీలో అత్యధిక మరణాలు సంభవించాయి, ఆ తరువాత స్థానంలో స్పెయిన్ మరియు యునైటెడ్ స్టేట్స్ ఉన్నాయి.

 

ఇక ప్రపంచ వ్యాప్తంగా ఈ మహమ్మారి బారిన పడినవారి సంఖ్య ఒక మిలియన్ దాటింది. కరోనాను నుంచి ప్రజలను రక్షించేందుకు పలు దేశాలు కట్టుదిట్టమైన చర్యలు చేపట్టాయి. సగం దేశాల్లో లాక్‌డౌన్‌ అమలవుతుండగా.. 350 కోట్ల మంది ప్రజల నిర్బంధంలోనే కొనసాగుతున్నారు. ఇలాంటి విప‌త్క‌ర ప‌రిస్థితులు ఎదుర్కోవ‌డానికి ప్ర‌ధాన కార‌ణం.. ఈ క‌రోనా మ‌హ‌మ్మారికి వ్యాక్సిన్ లేక‌పోవ‌డ‌మే. ప్ర‌స్తుతం క‌రోనా క‌ట్ట‌డికి ప్రపంచ దేశాల శాస్త్రవేత్తలు పరిశోధనల్లో మునిగిపోయారు. క్లినికల్ ట్రయల్స్ లో బిజీగా ఉన్నారు.

 

ఇలాంటి స‌మ‌యంతో అమెరికా అధ్య‌క్షుడు ప్ర‌పంచం మొత్తానికి ఓ అదిరిపోయే గుడ్ న్యూస్ తెలిపారు. అదేంటంటే.. కరోనాకు వ్యాక్సిన్ వచ్చేస్తుందట. అవును! ఇప్పటికే కరోనా వైరస్‌కు విరుగుడు వ్యాక్సిన్ కనుగొనే ప్రక్రియ సత్ఫలితాలను ఇచ్చే దశకు చేరుకున్నట్లు ఆయన వెల్ల‌డించారు. హైడ్రాక్సీక్లోరోక్వినైన్, అజిత్రోమైసిన్ కలయితో కొత్త రూపొందిస్తున్న ఈ కొత్త వ్యాక్సిన్ కరోనాను నివారించే అవకాశం ఉందని, ఈ ప్రాణాంతక వైరస్ అంతానికి హైడ్రాక్సీక్లోరోక్వినైన్ సరైన మొగుడని కాబట్టి ఇది ప్రభావవంతంగా ఆ వైరస్ పై పనిచేస్తుందని వైద్య నిపుణులు తెలిపారని ట్రంప్ చెప్పుకొచ్చారు.

 

ఒకవేళ ఇదే జరిగితే వైద్య చరిత్రలో అద్భుతం ఆవిష్కృతం అవుతుందని, గొప్ప మలుపు సాధ్యమవుతుందని ట్రంప్ అభిప్రాయ‌ప‌డుతున్నారు. ఇక ప్రస్తుతం ట్రంప్ చేసిన ప్ర‌క‌ట‌న‌కు అనూహ్య స్పందన వస్తోంది. ఏదేమైనా ట్రంప్ చెప్పిన‌ట్టు వ్యాక్సిన్ క‌నుక త్వ‌ర‌గా వ‌స్తే.. క‌రోనాకు చెక్ పెట్ట‌వ‌చ్చు.

 

క‌రోనాపై సెల్ఫ్ అసెస్‌మెంట్ టెస్ట్‌ :

 

NIHWN  వారి సంజీవ‌న్ మీకు క‌ల్పిస్తోన్న ఈ అవ‌కాశం.. క‌రోనాపై ఈ క్రింది లింకుల ద్వారా యాప్ డౌన్‌లోడ్ చేసుకుని సెల్ఫ్ అసెస్‌మెంట్ చేసుకోండి.

 

Google: https://tinyurl.com/NIHWNgoogle

 

apple : https://tinyurl.com/NIHWNapple

మరింత సమాచారం తెలుసుకోండి: